యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం). డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్న చిత్రయూనిట్.. ఆదివారం సాయంత్రం ముంబైలోని ఫిల్మ్‌సిటీలో ఓ భారీ ఈవెంట్ ప్లాన్ చేసింది. ఈ వేడుక కోసం ఇప్పటికే రామ్‌చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి, కీరవాణి ఇతర చిత్ర బృందం ముంబై చేరుకుంది.
అయితే ఈ ఈవెంట్ విషయంలో ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్‌కి జక్కన్న బిగ్ షాక్ ఇచ్చాడు. అసలేం జరిగిందంటే.. ముంబైలో జరగబోయే ఆర్ఆర్ఆర్ ఈవెంట్‌ను లైవ్‌లో చూస్తూ తెగ ఎంజాయ్ చేయవచ్చని ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులూ అనుకున్నారు. కానీ, ఆర్ఆర్ఆర్ ఈవెంట్‌కి లైవ్ ఇవ్వడం లేదు. ఈ విషయాన్ని మేకర్స్ సైతం అధికారికంగా ప్రకటించింది.
దీంతో అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఇటు చరణ్ ఫ్యాన్స్ రాజమౌళిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏంటీ ఇలా చేశావ్ జక్కన్నా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆనందించాల్సి విషయం ఏంటంటే.. ముంబైలో జరుగుతున్న ఆర్ఆర్ఆర్ ఈవెంట్‌ను ఓ ప్రముఖ హిందీ ఛానెల్ డిసెంబర్ 31న ప్రసారం చేయనుంది.