బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ఆఖరి దశకు చేరుకుంది. ఫినాలే ఎపిసోడ్ మరి కొన్ని గంటల్లో అట్టహాసరంగా ప్రారంభం కాబోతోంది. ఎవరూ ఊహించని అతిథులు బిగ్ బాస్ ఫినాలేలో సందడి చేయబోతున్నారు. ఎన్నో వారాలు కష్టపడి షణ్ముఖ్ జశ్వంత్, సిరి, మానస్, సన్నీ, శ్రీరామ్‌లు టాప్ 5కి చేసుకున్న సంగతి తెలిసిందే.
అయితే లీకుల వీరుల సమాచారం ప్రకారం.. టైటిల్ రేసు నుంచి సిరి, మానస్ లు మొదట ఎలిమినేట్ అయ్యారని తెలుస్తుండగా.. టాప్ 3లో సన్నీ, షణ్ముఖ్, శ్రీరామ్ నిలిచారు. ఇక వీళ్లలో చివరకు సన్నీ విన్నర్ అయ్యాడని న్యూస్ బయటికి వచ్చింది. శ్రీరామ్ గట్టి పోటీ ఇచ్చినా కూడా ఓటింగ్‌లో సన్నీనే దూసుకుపోయి విజేతగా నిలిచాడటని అంటున్నారు.
ఇక బిగ్ బాస్ 5 విన్నర్ ప్రైజ్ మనీ విషయానికి వస్తే.. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా రూ.50 లక్షలు ఇవ్వబోతున్నారు. అయితే రూ. 50 లక్షల ప్రైజ్ మనీ మొత్తం సూట్ కేస్‌లో పెట్టి ఇచ్చేయరట. ఆ యాభై లక్షల్లో టాక్స్‌లను మినహాయిస్తారు. అంటే.. మొత్తం యాభై లక్షల్లో దాదాపు రూ.15 లక్షలను టాక్స్ రూపంలో కట్ చేస్తారు.
దీంతో విజేత చేతికి వచ్చేది రూ.35 లక్షలు మాత్రమే. అయితే ఈ సారి ప్రైజ్ మనీతో పాటుగా ట్రోఫీని గెలుచుకున్న విజేతకు సొంత ఇంటిని కట్టుకోవడం కోసం షాద్‌నగర్‌లో సువర్ణ కుటీర్‌లో రూ.25 లక్షల విలువైన 300 చదరపు గజాల స్థలాన్ని సైతం ఇవ్వబోతున్నారు. ఈ విషయాన్ని నాగార్జున ఇప్పటికే తెలియజేశారు.