టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లుగా పేరొందిన పూజా హెగ్డే, రష్మిక మందన్నల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీరిద్దరూ అటూ, ఇటుగా ఒకే సారి సినీ కెరీర్‌ను స్టార్ట్ చేశారు. అనూహ్యంగా ఇద్దరూ స్టార్ స్టేటస్‌ను దక్కించుకున్నారు. అలాగే ప్రస్తుతం వీరు తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ భాషల్లోనూ నటిస్తూ ఫుల్ బిజీగా లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు.
ఇలాంటి తరుణంలో పూజా హెగ్డేకు రష్మిక బిగ్ షాక్ ఇచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సాధారణంగా హీరో, హీరోయిన్లుగా ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పలు టాప్ బ్రాండ్స్ కు అంబాసిడర్స్ గా వ్యవహరిస్తారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రష్మికా ఓ ప్రముఖ మొబైల్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారింది.
వాస్తవానికి సదరు మొబైల్ కంపెనీ వారు తమ బ్రాండ్‌కి ప్రచార కర్తగా వ్యవహరించాలని మొదట పూజా హెగ్డే వద్దకు వెళ్లారట. అయితే అందుకు ఆమె రూ. 2 కోట్లను డిమాండ్ చేసిందట. దాంతో సదరు మొబైల్ కంపెనీ వారు రష్మికాను సంప్రదించగా.. ఆమె కేవలం రూ. కోటికే చేస్తానని చెప్పడంతో ఆ బ్రాండ్ రష్మిక ఖాతాలో పడింది.
ఇక రష్మికా తక్కువ రెమ్యూనరేషన్స్ కు ఒప్పుకుంటోందనే విషయం బయటకు రావడంతో.. పూజాకి సంబంధించిన కొన్ని టాప్ బ్రాండ్స్ సైతం ఆమెకు వద్దకే వెళ్లిపోతున్నాయట. మొత్తానికి పూజాకు వెళ్ళాల్సిన బ్రాండ్స్ రష్మికా కొట్టేయడంతో.. బుట్టబొమ్మకు షాక్ తగిలిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.