పుష్ప, ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, రాధే శ్యామ్ సినిమాల విడుదలకు సమయం ఎక్కువగా లేకపోవడంతో ఆ సినిమాల నుంచి వరుసగా అప్డేట్ వస్తూనే ఉన్నాయి. ఇవాళ మార్నింగ్ ఆర్ఆర్ఆర్ నుంచి ఎన్టీఆర్ కొమరం భీమ్ లుక్ రిలీజ్ చేశారు. సాయంత్రం నాలుగు గంటలకు రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు లుక్ కూడా విడుదల చేయనున్నారు.
కాగా ఇవాళ సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు పుష్ప ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు ఈ సినిమా మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఆ సినిమా యూనిట్ ఇవాళ మరో పోస్టర్ ను విడుదల చేసింది. అల్లు అర్జున్ పూల పూల చొక్కా ధరించి బైక్ వెళ్తున్న పోస్టర్ ను విడుదల చేసింది. సిగరెట్ తాగుతూ మాస్ లుక్ లో బన్నీ కేక పుట్టిస్తున్నాడు. ఇవాళ సాయంత్రం పుష్ప ట్రైలర్ విడుదల కానుండటంతో ముందస్తుగా అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తూ మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ పోస్టర్ ను విడుదల చేసారు.
ఈ పోస్టర్ విడుదలైన మరుక్షణంలోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. తొలిసారిగా అల్లు అర్జున్ ఊర మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. కాగా పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమైన ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
#PushpaTrailerDay 🔥🔥#PushpaTrailer out Today at 6:03 PM 🤘
Stay Hyped & Pumped in😎#PushpaTheRise #ThaggedheLe 🤙#PushpaTheRiseOnDec17 @alluarjun @iamRashmika #FahadhFaasil @aryasukku @ThisIsDSP @adityamusic @PushpaMovie pic.twitter.com/LWg4x81mAd— Mythri Movie Makers (@MythriOfficial) December 6, 2021