నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘అఖండ’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కరోనా కారణంగా దాదాపు రెండేళ్ల తరువాత ఈ సినిమా రిలీజ్ కావడంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. అయితే ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించడంతో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు. అయితే ఈ సినిమా ఊహించినదానికంటే ఎక్కువ విజయం అందుకోవడంతో బాలయ్యతో పాటు చిత్ర యూనిట్ కూడా ఫుల్ ఖుషీలో ఉంది. ఇక ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే కలెక్షన్లు వస్తుండటంతో ఈ సినిమా దర్శకనిర్మాతలతో పాటు యావత్ టాలీవుడ్ వర్గాలు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇక బాలయ్య ప్రస్తుతం మామూలు ఫాంలో లేడని చెప్పాలి. ఇప్పటికే అఖండతో వెండితెరపై దద్దరిల్లిపోయే సక్సెస్‌ను అందుకోగా, బుల్లితెరపై కూడా ఆయన అదిరిపోయే రచ్చ చేస్తున్నాడు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’లో బాలయ్య అన్‌స్టాపబుల్ టాక్ షోతో ఓ రేంజ్లో రెచ్చిపోతున్నాడు. ఇప్పటికే మూడు ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ టాక్‌షో తాజాగా నాలుగో ఎపిసోడ్‌కు రెడీ అయ్యింది. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను ఆహా తాజాగా రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఈ ప్రోమో కూడా ఓ రేంజ్లో ఉండటంతో బాలయ్య అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ ప్రోమోలో బాలయ్య చేసిన రచ్చ మామూలుగా లేదు. నాలుగో ఎపిసోడ్‌కు గెస్టులుగా అఖండ చిత్ర యూనిట్ వచ్చింది. దర్శకుడు బోయపాటి శ్రీను, నటుడు శ్రీకాంత్, హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ షోలో పాల్గొన్నారు.
అయితే ఈ క్రమంలో బాలయ్య తాను విలన్‌గా చేయడానికి రెడీ.. ఎవరైనా తనతో సినిమా చేసే దమ్ముందా అంటూ సవాల్ విసిరాడు. అయితే అదే సినిమాలో హీరోగా కూడా తానే చేస్తానంటూ పంచ్ వేశాడు బాలయ్య. ఇక ఈ ప్రోమోలో ఓ ఆట ఆడించిన బాలయ్య హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌పై ఫన్నీ కామెంట్స్ చేశాడు. థమన్‌ను ‘పాట నీదైనా, పాప నాది’ అంటూ కామెంట్ చేయడంతో అక్కడున్న ప్రేక్షకులు నవ్వుకున్నారు. ఇక తన కుటుంబంలో జరిగిన ఓ సంఘటన గురించి చెబుతూ బాలయ్య కన్నీరు పెట్టుకోవడం మనం ఈ ప్రోమోలో చూడొచ్చు. ఇక ఈ ప్రోమో ఇప్పటికే యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అసలు బాలయ్య ఇంత ఎనర్జీగా ఎలా ఉంటున్నాడురా బాబు అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా బాలయ్య ముందు అందరూ బలాదూర్ అంటూ నందమూరి ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. మరి ఈ ఎనర్జిటిక్ అన్‌స్టాబుల్ ప్రోమోను మీరూ ఓసారి చూసేయండి.