పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఒక లైలా కోసం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన `దువ్వాడ జగన్నాథం` సినిమాతో ఫస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత పూజా హెగ్డే వెనక్కి తిరిగి చూసుకోలేదు.
ఈమె నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడంతో.. టాలీవుడ్లోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయిందీ బ్యూటీ. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో నటిస్తూ ఒక్కో సినిమాకు నాలుగు కోట్లకు పైగా రెమ్యూనరేషన్ పుచ్చుకుంటున్న పూజా హెగ్డే తొలి సంపాదన ఎంతో తెలుసా..? రూ. 300. అవును, మీరు విన్నది నిజమే.
పూజా హెగ్డే చిన్న వయసులోనే కాలిగ్రఫీ నేర్చుకుంది. ఈ విషయం తెలుసుకున్న పూజా తాతగారు.. ఆమె చేత ఓ క్రీడా సంస్థ కోసం సర్టిఫికెట్లు రాయించేవారు. అలా రాసినందుకు గానూ రూ.300 ఇచ్చేవారట. అదే ఆమె తొలి సంపాదన. ఇక టీనేజ్‌లో మోడలింగ్ ద్వారా రూ. 5000 సంపాదించిన పూజా.. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ స్టేటస్‌ను దక్కించుకుంది.
కాగా, పూజా హెగ్డే సినిమాల విషయానికి వస్తే.. ఈమె ప్రభాస్ సరసన నటించిన `రాధేశ్యామ్` చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల కానుంది. అలాగే మరోవైపు ఆచార్యలో రామ్‌చరణ్‌కు జోడీగా నటించిన ఈ బ్యూటీ విజయ్ దళపతితో బీస్ట్ చిత్రంలో నటిస్తోంది. ఇక బాలీవుడ్‌లోనూ పూజా పలు ప్రాజెక్ట్స్‌ను టేకప్ చేసింది.