టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న స్టార్ డైరెక్టర్ రాజమౌళి, ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే అన్ని పనులు ముగించుకున్న ఈ సినిమాను సంక్రాంతి బరిలో పండగకు వారం ముందు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇక ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ సినిమా ట్రైలర్‌ను డిసెంబర్ 9న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా ఈ ట్రైలర్ కోసం ప్రేక్షకుల్లో అంచనాలను రెట్టింపు చేసేందుకు ఈరోజు ఈ సినిమా నుండి ఇద్దరు హీరోలకు సంబంధించి కొత్త పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్స్ చూస్తే ఒక కామన్ విషయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ రెండు పోస్టర్స్‌లోనూ హీరోలు గర్జించడం మనకు కనిపిస్తుంది. అయితే ఈ రెండు పోస్టర్స్‌లోనూ హీరోలకు చొక్కా లేదనే విషయాన్ని మీరు గమనించారా? అసలు హీరోలను చొక్కా లేకుండా ఎందుకు చూపించారు చిత్ర యూనిట్ అనేది ఇప్పుడు అభిమానుల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. అయితే ఈ విషయంపై చిత్ర వర్గాల్లో ఓ ఇంట్రెస్టింగ్ వార్త జోరుగా షికారు చేస్తోంది.
ఆర్ఆర్ఆర్ చిత్రంలో హీరోల ఇంట్రొడక్షన్‌కు సంబంధించిన సీన్స్ నుండి ఈ పోస్టర్స్‌ను డిజైన్ చేశారట చిత్ర యూనిట్. ఇక ఈ సీన్స్‌లో హీరోల యాక్షన్ ఎమోషన్స్ ఓ రేంజ్‌లో ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది. కాగా ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపిస్తాడు. ఇక ఈ సినిమాలో వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ పాన్ ఇండియా ఆడియెన్స్‌ను థ్రిల్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది. మొత్తానికి ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఒకేసారి ఇద్దరు హీరోల పోస్టర్స్‌ను చొక్కా లేకుండా రిలీజ్ చేసి జక్కన్న ప్రమోషన్స్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇక ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మాత డివివి దానయ్య ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.