టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు మహేష్. అయితే ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ గ్లింప్స్ ఇప్పటికే ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే మహేష్ తన నెక్ట్స్ మూవీపై ఫోకస్ పెట్టాడు.
ఈ క్రమంలో మహేష్ తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నట్లు ఇటీవల అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో అతడు, ఖలేజా వంటి చిత్రాలు రాగా, ఈసారి రాబోయే సినిమా ఖచ్చితంగా హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటుందని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా అదిరిపోయే అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాను మహేష్ ఎప్పుడు ప్రారంభిస్తాడా అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. కాగా ఈ సినిమాను ఫిబ్రవరి నెలలో ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక మొదటి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో వేసిన ఓ ప్రత్యేక సెట్‌లో తెరకెక్కిస్తారని, ఈ షెడ్యూల్‌లో ఓ సాంగ్‌ను చిత్రీకరిస్తారనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. ఇక ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
మరి నిజంగానే ఈ సినిమాను ఫిబ్రవరి నెలలో ప్రారంభిస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఈ విషయానికి సంబంధించి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. దీంతో ఇవన్నీ కేవలం పుకార్లేనని చిత్ర వర్గాల్లో మరో వార్త వినిపిస్తోంది. ఏదేమైనా మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న సినిమా రిలీజ్ కాకముందే, ఆయన నెక్ట్స్ మూవీ కోసం ప్రేక్షకుల్లో అప్పుడే అంచనాలు నెలకొనడం నిజంగా ఆయన సినిమాపై ఎన్ని అంచనాలు ఉన్నాయనే విషయాన్ని మనకు స్పష్టం చేస్తుంది. మరి త్రివిక్రమ్‌తో మహేష్ తెరకెక్కించబోయే సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఈ సినిమా పూర్తయ్యి రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.