సినీ ఇండస్ట్రీలో పెళ్లికి ముందే డేటింగ్లు, ఎఫైర్లు నడిపించడం సెలబ్రెటీలకు అలవాటే. అలాగే పెళ్లి కాకుండా లివర్స్‌తో చట్టాపట్టాలేసుకుని తిరగడం కూడా కామనే. అయితే ప్రస్తుతం టాలీవుడ్‌లో కొందరు హీరోయిన్లు పెళ్లికి ముందే ప్రియుళ్లతో మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హారోయిన్లు ఎవరో ఓ లుక్కేసేయండి.
రకుల్ ప్రీత్ సింగ్.. ఈ భామ ఇటీవల తన బర్త్‌డే నాడు బాలీవుడ్ హీరో, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నానని అధికారికంగా ప్రకటించింది. త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న ఈ జంట ప్రస్తుతం ప్రేమలో మునిగి తేలుతున్నారు.
అవికా గోర్.. `చిన్నారి పెళ్లికూతురు` సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ భామ హీరోయిన్‌గానూ గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఈ బ్యూటీ బుల్లితెర పరిశ్రమకు చెందిన మిలింద్ చాంద్వాని ప్రేమలో ఉంది. అతడితోనే ఏడడుగులు నడవబోతోంది.
శ్రుతీ హాసన్.. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలతో బిజీగా గడుపుతున్న ఈ అందాల భామ మరోవైపు శంతను హజారికతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతోంది. శంతనుతో కలిసి శ్రుతీ హాసన్ చేసే రచ్చ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది.
పాయల్ రాజ్‌పూత్.. `ఆర్ఎక్స్ 100` సినిమాతో బోల్డ్ బ్యూటీగా గుర్తింపు పొందిన ఈమె నటుడు సౌరబ్ దింగ్రాతో రిలేషన్షిప్ కొనసాగుతోంది. స్తుతం డేటింగ్ ఎంజాయ్ చేస్తున్న వీరిద్దరూ.. మరికొద్ది రోజుల్లో పెళ్లి పీటలెక్క అవకాశాలు ఉన్నాయి.