ఆర్ఆర్ఆర్ నుంచి ఎన్టీఆర్ సర్ప్రైజ్ లుక్… షేక్ అవుతున్న ట్విట్టర్..!

ఆర్ఆర్ఆర్ నుంచి వరుస సర్ప్రైజ్ లు వస్తూనే ఉన్నాయి. దీంతో అభిమానులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ మొదలైన చాలా రోజుల వరకు ఆ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ పెద్దగా రాలేదు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లుక్ కూడా బయట పడలేదు. ఇక సినిమా విడుదలకు టైం దగ్గర పడటంతో రాజమౌళి ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు. తన స్టైల్లో రోజుకొక విధంగా అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తున్నాడు.

ఇవాళ కూడా రాజమౌళి ఎన్టీఆర్ అభిమానులకు ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు. ఆర్ఆర్ఆర్ లో కొమరం భీమ్ పోస్టర్ తాజాగా ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ సినిమా నుంచి ఇది వరకు ఎన్టీఆర్ పోస్టర్లు కొన్ని విడుదల అయినప్పటికీ ఈ పోస్టర్ మాత్రం ఓ రేంజ్ లో ఉంది. గోచి కట్టుకొని కండలు తిరిగిన దేహంతో ఎన్టీఆర్ అభిమానులను ఆకట్టు కుంటున్నాడు.

ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ ధీరత్వం అలరించేలా ఉంది. ట్విట్టర్ ద్వారా విడుదల చేసిన ఈ పోస్టర్ నిమిషాల గ్యాప్ లోనే వైరల్ గా మారింది. అభిమానులు లైక్స్ రీట్వీట్లతో మోత మోగిస్తున్నారు. మొత్తానికి సోషల్ మీడియా మొత్తం ఈ పోస్టర్ ఊపేస్తోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ మల్టీ స్టారర్ మూవీ జనవరి 7వ తేదీన పలు భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సినిమా రాకపై అటు అభిమానులు, ఇటు ట్రేడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది.