`పుష్ప` ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్ ఎవ‌రో తెలుసా?

November 30, 2021 at 8:44 am

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప‌`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిత‌మ‌వుతున్న ఈ మూవీలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. ఫహాద్‌ ఫాజిల్, సునీల్ విల‌న్లుగా క‌నిపించ‌బోతున్నారు. అలాగే ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్ `పుష్ప ది రైస్‌` పేరుతో డిసెంబ‌ర్ 17న విడుద‌ల చేయ‌బోతున్నాడు.

ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మోష‌న్స్ షురూ చేసిన చిత్ర యూనిట్‌.. డిసెంబరు 6న ట్రైలర్‌ని విడుదల చేయబోతున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. అలాగే పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను డిసెంబర్ 12న నిర్వ‌హించేందుకు సన్నాహాలు మొదలయ్యాయని సమాచారం. హైదరాబాద్‌లో భారీ స్థాయిలో జ‌ర‌గ‌బోతున్న ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి స్పెష‌ల్ గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ రాబోతున్నాడ‌ట‌.

ఇప్ప‌టికే పుష్ప మేక‌ర్స్ ప్ర‌భాస్‌ను స్వ‌యంగా క‌లిసి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఆహ్వానించ‌గా.. ఆయ‌న వెంట‌నే ఓకే చెప్పార‌ని తెలుస్తోంది. మ‌రి నిజంగా ప్ర‌భాస్ చీఫ్ గెస్ట్‌గా వ‌స్తే.. పుష్ప‌పై మ‌రిన్ని అంచ‌నాలు పెర‌గ‌డం ఖాయమ‌ని అంటున్నారు.

కాగా, ఎర్రచంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం తెలుగుతో పాటుగా హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుద‌ల కాబోతోంది. అలాగే ఈ చిత్రంలో యాంక‌ర్ అన‌సూయ ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తుండ‌గా.. టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత స్పెష‌ల్ సాంగ్‌లో మెర‌వ‌బోతోంది.

`పుష్ప` ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్ ఎవ‌రో తెలుసా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts