భారీ రిస్క్ చేస్తున్న నాగార్జున..తేడా వ‌స్తే ఇక అంతే!

November 30, 2021 at 8:06 am

టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్ర‌స్తుతం త‌న‌యుడు నాగ చైత‌న్య‌తో క‌లిసి `బంగార్రాజు` సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో ర‌మ్య‌కృష్ణ‌, కృతి శెట్టిలు హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’కు ప్రీక్వెల్‌గా రూపొందుతోన్న చిత్రం కావడంతో ఈ సినిమా భారీ అంచనాలు ఉన్నాయి.

ప్రేక్ష‌కులు కోరుకునే విధంగానే అన్ని హంగులతో ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి బ‌రిలో దింపాల‌ని మేక‌ర్స్ ముందు నుంచీ అనుకున్నారు. కానీ, సంక్రాంతి రేసులో ఇప్ప‌టికే ఆర్ఆర్ఆర్‌(జ‌న‌వ‌రి 7), భీమ్లా నాయ‌క్ (జ‌న‌వ‌రి 12), రాధే శ్యామ్‌(జ‌న‌వ‌రి 14) చిత్రాలు ఉన్నాయి.

దీంతో బంగార్రాజు సంక్రాంతికి వ‌చ్చే ఛాన్స్ లేద‌ని అంద‌రూ భావించారు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. మేక‌ర్స్ బంగార్రాజును సంక్రాంతికే తీసుకురాబోతున్నార‌ట‌. ఈ సినిమాను జనవరి 15న విడుదల చేసేందుకు డేట్ కూడా లాక్ చేశార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతే కాదు, త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా రానుంద‌ని టాక్.

మ‌రి ఇదే నిజ‌మైతే.. నాగార్జున భారీ రిస్క్ చేస్తున్న‌ట్లే అవుతుంది. ఎందుకంటే, సంక్రాంతికి ఒక‌టి కాదు, రెండు కాదు ఏకంగా మూడు బ‌డా చిత్రాలు వ‌స్తున్నాయి. ఇప్పుడు వీటితో పాటు బంగార్రాజు కూడా దిగితే.. థియేట‌ర్స్ దొర‌క్క చాలా ఇబ్బంది ప‌డాల్సి ఉంటుంద‌ని, ఫ‌లితంగా ఆ ప్ర‌భావం క‌లెక్ష‌న్స్‌పై ప‌డుతుంద‌ని అంటున్నారు.

భారీ రిస్క్ చేస్తున్న నాగార్జున..తేడా వ‌స్తే ఇక అంతే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts