మ‌హేష్‌ సినిమాకే నో చెప్పిన యాంక‌ర్ ర‌వి.. కార‌ణం..?

November 30, 2021 at 7:35 am

బుల్లితెర‌పై యాంక‌ర్‌గా స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ర‌వి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మా టీవీలో ప్రసారమయ్యే లవ్ జంక్షన్ అనే ప్రోగ్రామ్ ద్వారా బుల్లి తెరపై అడుగుపెట్టిన ఈయ‌న అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ స్మాల్ స్క్రీన్‌పై బిజీ యాంక‌ర్స్ లిస్ట్‌లో చేరిపోయాడు. ఈ మ‌ధ్య తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లోనూ పాల్గొన్న ర‌వి.. టాప్ 5కి వెళ్ల‌కుండా 12వ వార‌మే ఎలిమినేట్ అయ్యాడు.

ఇదిలా ఉంటే.. బుల్లితెర‌పై యాంక‌ర్‌గా దూసుకుపోతున్న వారు మ‌రోవైపు వెండితెర‌పై సైతం స‌త్తా చాటుతున్న విష‌యం తెలిసిందే. అలాగే ర‌వి కూడా అడ‌పా త‌డ‌పా సినిమాలు చేసి బిగ్ స్క్రీన్‌పై త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నాడు. కానీ, ఆయ‌న‌కు వెండితెర‌పై అనుకున్న స్థాయిలో గుర్తింపు ద‌క్క‌క‌పోవ‌డంతో.. బుల్లితెర‌పైనే సెటిల్ అయిపోయాడు.

ఈ క్ర‌మంలోనే ఎన్నో సినిమాలలో అవకాశాలు వచ్చినా కూడా ర‌వి వదులుకున్నాడు. ఇక ర‌వి నో చెప్పిన సినిమాల్లో మ‌హేష్ బాబు న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం `మ‌హ‌ర్షి` ఒక‌టి. వంశీ పైడిపల్లి దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించ‌గా.. అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర‌ను పోషించాడు.

శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పివిపి సినిమా బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా నిర్మిత‌మైన ఈ చిత్రం 2019లో విడుద‌లే సూప‌ర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ మూవీలో మహేష్ బాబు కు పర్సనల్ అసిస్టెంట్ గా యాంకర్ రవి ని అనుకున్నారట దర్శకనిర్మాతలు. ఈ క్ర‌మంలోనే రవిని సంప్ర‌దించ‌గా.. ఆయ‌న బుల్లితెర‌పై బిజీగా ఉండ‌టం వ‌ల్ల నో చెప్పాడ‌ట‌. దాంతో ఆ పాత్ర లో శ్రీనివాసరెడ్డి చేసి మెప్పించాడు.

 

మ‌హేష్‌ సినిమాకే నో చెప్పిన యాంక‌ర్ ర‌వి.. కార‌ణం..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts