ఆ హీరోతో న‌టించాకే నా పెళ్లి అన్న ర‌కుల్‌.. ఫ్యాన్స్ అస‌హ‌నం..?

`కేరటం` మూవీతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన‌ ర‌కుల్ ప్రీత్ సింగ్..వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేస్తూ స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకున్న ర‌కుల్‌.. స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌నా ఆడిపాడింది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ టాలీవుడ్‌లో కంటే బాలీవుడ్‌, కోలీవుడ్ చిత్రాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది.

Rakul Preet Singh: Tollywood drug case: Actress Rakul Preet Singh appears  before ED in Hyderabad - The Economic Times

ఇదిలా ఉంటే.. స్టార్ హీరోయిన్లకు తరచుగా ఎదురయ్యే ప్రశ్న పెళ్లి గురించే. ర‌కుల్‌కు కూడా ఎన్నో సార్లు పెళ్లి ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయి. గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలోనూ ర‌కుల్‌ను ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నార‌ని ప్ర‌శ్నించారు. అయితే అప్పుడు ర‌కుల్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో లింక్ పెడుతూ ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చింది.

rakul-preet-singh-about-mahesh-babu-1 - PrinceMahesh.Com

తాను మహేష్ బాబుతో కలిసి నటించే వరకు పెళ్లి చేసుకోనని తెలిపింది. టాలీవుడ్ లో చాలా వరకు స్టార్ హీరోలతో నటించాను. కానీ, మహేష్ తో న‌టించ‌లేదు. ఆయ‌న‌తో న‌టించ‌డం నా కోరిక‌. పెళ్లి చేసుకుంటే మహేష్ తో అవకాశం రాక‌పోవ‌చ్చు. అందుకే అతనితో నటించాకే పెళ్లి చేసుకుంటానని తెలిపింది. ఇక ఆ త‌ర్వాత మ‌హేష్ స‌ర‌స‌న స్పైడ‌ర్ చిత్రంలో న‌టించిన ర‌కుల్‌.. త‌న కోరిక‌ను తీర్చుకుంది గానీ, ఇప్ప‌టి వ‌ర‌కు పెళ్లి ఊసే ఎత్త‌డం లేదు.