అవార్డుల పంట పండిస్తున్న మహేష్… మహర్షి..?

సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ లో ఎంత గొప్ప నటుడో మనందరికీ తెలిసిన విషయమే.ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు.మహేష్ బాబు టాలీవుడ్ కు ఏదైనా కొత్త కథతో ఎప్పుడు మనముందుకు వస్తూనే ఉంటాడు. అలా వచ్చిన కథలతో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాడు మహేష్ బాబు.ఇప్పుడు కూడా మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా విడుదలై ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది.

ఈ సినిమా విడుదలై రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇంకా అవార్డులు ప్రశంసలు అందుతూనే ఉన్నాయి.ఇక అసలు విషయంలోకి వస్తే సాక్షి ఎలక్షన్స్ అవార్డులలో 2019 సంవత్సరానికి గాను.. సూపర్ స్టార్ ఉత్తమ నటుడు అవార్డు గా ప్రకటించబడ్డాయి.ఈ విషయం కొద్ది గంటల క్రితమే ఈ అవార్డులను మహేష్ బాబు స్వయంగా అందుకున్నాడు.

ఉత్తమ నటుడు అవార్డు కాకుండా మరో రెండు ప్రధాన అవార్డులను కూడా గెలుచుకున్నాడు. ఇక 2019 సంవత్సరంలో ఈ సినిమా ఉత్తమ చిత్రంగా ప్రకటించబడింది.ఈ సినిమాకి నిర్మించిన నిర్మాత దిల్ రాజు కూడా అవార్డును అందుకున్నారు. మరొక అవార్డ్ వంశీపైడిపల్లి ఉత్తమ దర్శకుడి అవార్డు గా పొందాడు.2 years for Mahesh Babu Maharshi