అవ‌కాశాలు లేక పేకాట‌కు బానిసైన ప్ర‌ముఖ హీరోయిన్..చివ‌ర‌కు..?

సినీ ఇండ‌స్ట్రీలో వ‌రుస అవ‌కాశాల‌తో బిజీ బిజీగా గ‌డిపి.. ఒక్క‌సారిగా ఫేడ‌వుట్ అయిపోతే వ‌చ్చే బాధ అంతా ఇంతా కాదు. ఈ బాధను త‌ట్టుకోలేక, ముందుకూ సాగ‌లేక జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ఈ క్ర‌మంలోనే చెడు అల‌వాట్ల‌కు బానిస‌లు మారుతుంటారు. ఇక ఓ హీరోయిన్ కూడా అవ‌కాశాలు లేక పేకాట‌కు బానిసైపోయింది. ఇంత‌కీ ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు శ్రద్దాదాస్.

Actress Shraddha das latest pictures | ThatisY.com | Bollywood actress hot  photos, Bollywood girls, Indian actress hot pics

`సిద్దు ఫ్రం శ్రీకాకుళం` సినిమాతో తెలుగ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన శ్రద్దాదాస్.. త‌న‌దైన అందం, న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌కు విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. స్టార్ హీరోయిన్‌గా ఎద‌గ‌లేక‌పోయినా తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ చిత్రాల్లో సెకండ్ హీరోయిన్ పాత్రలు, ఐటెం సాంగ్స్, ప్రత్యేకమైన పాత్రల్లో నటిస్తూ బాగానే క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఏమైందో ఏమో గానీ శ్ర‌ద్ధాకు అవ‌కాశాలు త‌గ్గుతూ వ‌చ్చాయి. గ్లామ‌ర్ డోస్ పెంచినా ఫ‌లితం లేకుండా పోయింది.

Shraddha Das Photos [HD]: Latest Images, Pictures, Stills of Shraddha Das -  FilmiBeat

ఈ క్ర‌మంలోనే గ‌తంలో ఓ రోజు తన సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటో పంచుకోగా అందులో తను పేకాట ఆడుతున్నట్లుగా కనిపించింది. అంతేకాకుండా ఈ ఆటకు బాగా బానిస అవుతున్నట్లుగా కూడా కనిపించింది. దాంతో ఆమె ఫ్యాన్స్ తెగ కంగారు ప‌డ్డారు. అయితే చివ‌ర‌కు మ‌ళ్లీ పుంజుకున్న శ్రద్దా ఇప్పుడిప్పుడే ప‌లు అవ‌కాశాలు అందుకుంటూ కెరీర్‌ను ట్రాక్‌లో పెట్టుకునేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తుంది. ఇక ఇటీవ‌ల ఏక్ మినీ కథలో ఈమె న‌టించిన పాత్ర ప్రేక్ష‌కుల‌ను బాగానే ఆక‌ట్టుకుంది.