`రిపబ్లిక్` సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై, మంత్రులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో పవన్‌ను వైఎస్ఆర్సీపీ నేతలు ఏకిపారేస్తున్నారు. ఇందులో భాగంగా ఆ పార్టీనేత సినీ నటుడు, దర్శకుడు, రచయత పోసాని కృష్ణమురళి కూడా పవన్‌పై విరుచుకుపడ్డారు.
పవన్ కల్యాణ్ ప్రజల మనిషి కాదు, సినిమా పరిశ్రమ మనిషి కూడా కాదని విమర్శించారు. పవన్ రెమ్యూనరేషన్పై, ఆయన అభ్యంతరకరంగా భాషపై విమర్శలు గుప్పించారు. అంతేకాదు, ఒక పంజాబీ హీరోయిన్ ప్రస్తావన కూడా తీసుకొచ్చి పోసాని మరింత హీట్ పెంచేశారు. అయితే పోసాని ప్రసంగం ముగిసిన వెంటనే పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్ట్రోంగ్ కౌంటర్ ఇచ్చారు.
`తుమ్మెదల ఝుంకారాలు.. నెమళ్ళ క్రేంకారాలు.. ఏనుగుల ఘీంకారాలు..వైసీపీ గ్రామసింహాల గోంకారాలు సహజమే..` అంటూ ట్వీట్ చేశారు పవన్. అక్కడితో ఆగలేదు.. `హూ లెట్ ది డాగ్స్ అవుట్` (ఈ కుక్కలను బయటికి ఎవరు వదిలారు) అనే సూపర్ హిట్ పాప్ సాంగ్ యూట్యూబ్ లింక్ షేర్ చేస్తూ.. ఇన్‌డైరెక్ట్‌గా పోసానిని మరియు వైసీపీ నాయకులను కుక్కలతో పోల్చేశాడు. దాంతో ఆయన ట్వీట్లు వైరల్‌గా మారాయి.
https://twitter.com/PawanKalyan/status/1442514395754467332?s=20
https://twitter.com/PawanKalyan/status/1442517297646563334?s=20