జక్కన్న తారక్‌నే ఎందుకు హైలైట్ చేస్తున్నాడు.. అసలు మర్మం ఏమిటో?

మల్టీస్టారర్ సినిమా అంటేనే జనంలో ఆ సినిమాపై ఎలాంటి క్రేజ్ నెలకొంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అలాంటిది ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో నటించడం, అది కూడా తెలుగు సినీ వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకుడి డైరెక్షన్‌లో అంటే ఆ సినిమాపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. అవును.. మనం మాట్లాడుకుంటోంది టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ గురించే. దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ ఫిక్షనల్ స్టోరీ సినిమాను ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసేలా తీస్తాడా అని అందరూ ఎదురుచూస్తున్నారు. కానీ ఈ సినిమా మొదట్నుండీ చాలా మందిలో ఒక ప్రశ్న వినిపిస్తుంది. కానీ దాని గురించి పెద్దగా పట్టించుకునే వారు కూడా లేరనుకోండి.

ఇంతకీ ఏమిటా ప్రశ్న అని మీరు అడిగితే.. అసలు మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. ఈ సినిమా మొదట్నుండీ దర్శకుడు రాజమౌళి ఈ సినిమాతో ఎన్టీఆర్ విశ్వరూపం చూపించనున్నాడని, ఆ తరువాత ఆయన స్థాయిని అందుకోవడం ఎవరితరం కాదని చెబుతూ వస్తున్నాడు. ఈ కామెంట్స్‌తో మెగా ఫ్యాన్స్ హర్ట్ అవుతారని ముందుగా రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన అల్లూరి సీతారామరాజు టీజర్‌ను రిలీజ్ చేసి వారిని కూల్ చేశాడు. అయితే ఆ తరువాతే అసలు సంగతి బయటపడింది. రామరాజు పాత్రకు సంబంధించిన టీజర్‌కు అమ్మమొగుడిలా భీం పాత్ర టీజర్‌ను తీర్చిదిద్దాడు జక్కన్న. ఇక భీం టీజర్ సృష్టించిన రికార్డుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అంతేగాక, ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి రెండు భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్రత్యేకంగా చేయించాడట జక్కన్న.

దీన్ని బట్టి చూస్తే, ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్, చరణ్‌ల పాత్రల్లో తారక్ పాత్రపైనే జక్కన్న ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు అనిపిస్తుంది. అయితే ఇక్కడ చరణ్ పాత్రను తక్కువ చేసి చూపించాడని మనం అస్సలు అనుకోవద్దు. సినిమాలో చరణ్ పాత్రకు సంబంధించి ఏదైనా సర్‌ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంటే ఇక థియేటర్లలో రచ్చలేవడం ఖాయం. కానీ ఇప్పటికైతే తారక్‌నే జక్కన్న ఎందుకు హైలైట్ చేసి చూపిస్తున్నాడో, అసలు అందులో మర్మం ఏమిటో ఆయనకే తెలియాలి అంటున్నారు సినీ విశ్లేషకులు.