ఆర్య పై కేసు నమోదు చేయించిన శ్రీలంక యువతి..?

కోలీవుడ్ లో స్టార్ హీరోగా గుర్తింపు పొందుతున్న ఆర్య కేవలం నటుడు మాత్రమే కాదు డైరెక్టర్ కూడా. అయితే ఇప్పుడు అనుకోని విధంగా ఊహించని స్థాయిలో ఒక చీటింగ్ కేసులో చెన్నై పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. ఇక దాదాపుగా మూడు గంటల పాటు పోలీస్ విచారణలో ఆర్య పాల్గొన్నాడు. ఇకపోతే ఆర్య పోలీస్ స్టేషన్ కు వెళ్ళడానికి గల కారణాలు ఏంటి..? అని ఎన్నో రూమర్లు వచ్చినప్పటికీ ఆయన పై ఒక శ్రీలంక యువతి చీటింగ్ కేసు నమోదు చేసినట్లు అసలు విషయం తెలిసింది.

ఆమె తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ,మోసం చేశాడని, అంతే కాదు రూ.70 లక్షలు కూడా తీసుకున్నాడు అని శ్రీలంక యువతి ఆర్య పై చీటింగ్ కేసు నమోదు చేయించింది. ఇకపోతే ఆన్లైన్ ద్వారా శ్రీలంకకు చెందిన ఒక యువతి జర్మనీ నుంచి కేసు నమోదు చేయించింది. అలాగే ఆర్యతో తను చేసిన చాటింగ్ కూడా స్క్రీన్ షాట్ పెట్టి ఆ యువతి పోలీసులకు ఇచ్చినట్లు సమాచారం. అంతేకాదు ఈ కేసు పై ఫిర్యాదును స్వీకరించిన చెన్నై న్యాయస్థానం, ఈ కేసుకు సంబంధించిన తగిన ఆధారాలను సేకరించి, ఆర్య పై విచారణ కొనసాగించాలని చెన్నై పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ కేసుపై ఆర్య ఎటువంటి సమాచారాన్ని ఇవ్వడం లేదు. కాగా మంగళవారం చెన్నై పోలీసులు ఎదుట హాజరయ్యారు . చెన్నై న్యాయస్థానం ఈ నెల 17 తారీకు మరోసారి కేసు విచారణ చేయడానికి పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఇకపోతే 41 సంవత్సరాల వయసు కలిగిన ఆర్య 22 సంవత్సరాల వయసు కలిగిన సయేసా ను వివాహం చేసుకుని, వీరికి ఒక కూతురు కూడా జన్మించిన విషయం తెలిసిందే.