మెగా ఫ్యామిలీతో బ‌న్నీకి ప‌డ‌టం లేదా..అందుకే అలా చేశాడా?

మెగా ఫ్యామిలీతో బ‌న్నీకి ప‌డ‌టం లేదా..? గ‌త కొద్ది రోజులుగా ఈ వార్త తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది. కారణాలు ఏమైనా కానీ, ఈ వార్తలపై సరైన క్లారిటీ మాత్రం రాలేదు. అయితే తాజా ప‌రిస్థితులు ఈ వార్త‌కు మ‌రింత బ‌లాన్ని చేకూర్చాయి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..మెగా ఫ్యామిలీ నుంచి ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన‌ప్ప‌టికీ అల్లు అర్జున్‌..త‌న‌దైన స్టైల్‌, న‌ట‌న‌తో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరో స్థాయికి చేరుకున్నాడు. ప్ర‌స్తుతం పాన్ ఇండియా మూవీల‌ను కూడా చేస్తున్న ఈయ‌న‌..ఎంత ఎదిగిన మెగా ఫ్యామిలీలో వ్యక్తిగానే చెప్పుకుంటూ వచ్చాడు.

Is ​Allu Arjun​ trying too hard to look mature? - mirchi9.com

అయితే అల వైకుంఠపురములో సినిమా ఈవెంట్‌లో మాత్రం బ‌న్నీ..ఒంటరిగా ఇలా మీ ముందు నిలబడ్డాను అంటూ కన్నీళ్లు పెట్టుకోవ‌డం, అల్లు ఫ్యామిలీ గురించే మాట్లాడ‌టంతో చిరంజీవి కుటుంబానికీ, అల్లు అర్జున్‌కు మధ్యలో గ్యాప్ పెరిగిందనే వార్త ఊపందుకుంది. ఇక ఈ విష‌యం ప‌క్క‌న పెడితే ఇప్పుడు మ‌రో కొత్త అంశం చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఆదివారం మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు మ‌రియు రక్షాబంధన్ కావ‌డంతో..ఆయ‌న ఇంట బ‌ర్త్‌డే వేడుకలు అలాగే రక్షాబంధన్‌ వేడుకలు ఘనంగా జరిగాయి.

Chiranjeevi's B-Day celebrations with brothers go viral

పవన్‌ కల్యాణ్‌, నాగబాబు, రామ్‌ చరణ్‌, ఉపాసన కామినేని, సుస్మిత, శ్రీజ వారి ఫ్యామిలీ, చిరంజీవి అక్కాచెల్లెలు, మెగా మేనల్లుళ్లు సాయి ధరమ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌, మెగా హీరో వరుణ్‌ తేజ్‌, నిహారిక ఆమె భర్త చైత‌న్య, అల్లు అరవింద్ దంపతులు ఇలా అంద‌రూ హాజ‌రు అయ్యారు. కానీ, అల్లు అర్జున్‌-స్నేహా రెడ్డి మాత్రం క‌నిపించ‌లేదు. మ‌రియు అల్లు శిరీష్ కూడా హాజ‌రు కాలేదు.

Did you know Allu Arjun introduced wife Sneha Reddy first as a girlfriend  to Samantha Akkineni? WATCH Video | PINKVILLA

శిరీష్ సంగతి పక్కన పెడితే మెగా ఫ్యామిలీలో అంత్యంత ముఖ్యమైన ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ ఎందుకు హాజరు కాలేదు అనే ప్రశ్న పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. ఈ నేప‌థ్యంలోనే మెగా ఫ్యామిలీకి బ‌న్నీకి మ‌ధ్య స‌ఖ్య‌త లేద‌ని.. అందుకే ఆయ‌న చిరు బ‌ర్త్‌డే వేడుక‌ల్లో పాల్గొన‌లేద‌ని ప్రచారం జ‌రుగుతోంది. మ‌రోవైపు మాత్రం షూటింగ్‌లో బిజీగా ఉండటం వ‌ల్లే బ‌న్నీ వెళ్ల‌లేక‌పోయ‌ర‌ని టాక్ న‌డుస్తోంది. ఏదేమైనా ఈ మెగా వేడుకలో బ‌న్నీ లేకపోడం ఏదో వెలితిగా క‌నిపిస్తోంది.

Share post:

Latest