లోహితతో కార్తికేయ లవ్‌ స్టోరీ..ఎప్పుడు, ఎలా స్టార్ట్ అయిందో తెలుసా?

`ఆర్‌ఎక్స్‌ 100` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన యంగ్ హీరో కార్తికేయ‌.. మొద‌టి సినిమాతోనే హిట్ అందుకుని సూప‌ర్ క్రేజ్ ద‌క్కించుకున్నాడు. ప్ర‌స్తుతం వాలిమై, రాజా విక్రమార్క అనే చిత్రాల్లో న‌టిస్తున్న కార్తికేయ‌.. త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఆయన నిశ్చితార్థం సైలెంట్‌గా జ‌రిగిపోయింది.

Hero Karthikeya Gets Engaged Secretly -

దాంతో కార్తికేయ చేసుకోబోయే అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి వివ‌రాలు ఏంటీ? ఎలా కలిశారు? బంధువుల అమ్మాయా? లేక లవ్వా అంటూ నెటిజ‌న్లు సోష‌ల్ మీడియా ద్వారా ర‌క‌ర‌కాల ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే కార్తికేయ త‌న ల‌వ్ స్టోరీ రివిల్ చేసి అంద‌రికీ షాక్ ఇచ్చాడు. `ఆమె పేరు లోహిత రెడ్డి. నిట్‌ వరంగల్‌లో 2010లో తొలిసారి లోహితను కలిశాను.

Kartikeya Gummakonda Birthday: A Look at the actor's upcoming films | The  Times of India

నాటి నుంచి కొనసాగుతూ వచ్చిన ఈ స్నేహబంధం ఇప్పుడు పెళ్లిగా మారబోతోంది. నా ప్రాణ స్నేహితురాలితో నాకు నిశ్చితార్థం జరిగింది. తను నా జీవిత భాగస్వామి కాబోతోంది` అంటూ సోష‌ల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా తమ పాత, ప్రస్తుత ఫొటోలను షేర్‌ చేశాడు. దాంతో కాబోయే వధూవరులకు సినీ ప్రముఖులు, అభిమానులు విషెస్ తెలియ‌జేస్తున్నారు.

https://twitter.com/ActorKartikeya/status/1429809473766387722?s=20