మందేసి ఆ హీరోయిన్‌తో చిందేసిన జగపతిబాబు..వీడియో వైర‌ల్‌!

August 6, 2021 at 11:23 am

విల‌క్ష‌ణ న‌టుడు జ‌గ‌పతిబాబు మందేసి హీరోయిన్‌తో చిందులు వేయడం ఏంటీ..? ఇంత‌కీ ఆ హీరోయిన్ ఎవ‌రు..? అస‌లు ఏంటీ క‌థా..? అన్న సందేహాలు టైటిల్ చూడ‌గానే మీ మ‌దిలో మెదిలే ఉంటాయి. మ‌రి మీ సందేహాల‌కు స‌మాధానం దొర‌కాలంటే..ఆల‌స్యం చేయ‌కుండా అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే.

అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా రూపొందుతున్న సినిమా `మహా సముద్రం`. ఈ చిత్రంలో అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్లుగా నటించ‌గా.. జగపతి బాబు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ చిత్రం నుంచి తాజాగా `హే రంభ.. రంభ` లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.

ఈ సాంగ్‌లో రంభ మాయలో ప‌డిన జ‌గ‌ప‌తిబాబు.. ఫుల్‌గా మందేసి ఆమె ఫ్లెక్సీల‌తో చిందులేస్తూ నానా హంగామా చేశారు. జ‌గ‌ప‌తిబాబు ఒక్క‌రే కాదు.. శర్వానంద్ కూడా మ‌ద్యం మత్తులో తేలుతూ హే రంభ.. రంభ అంటూ ర‌చ్చ ర‌చ్చ చేశారు. ఇక చైతన్ భరద్వాజ్ ఫ్రెష్ మ్యూజిక్ భాస్కర భట్ల సాహిత్యం ఈ సాంగ్ కి చాలా ఇంపుగా సెట్టయ్యాయి. మొత్తానికి ఆక‌ట్టుకుంటున్న ఈ లిరిక‌ల్ సాంగ్ సినిమాపై మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది.

 

మందేసి ఆ హీరోయిన్‌తో చిందేసిన జగపతిబాబు..వీడియో వైర‌ల్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts