కొర‌టాల కోసం అలా క‌నిపించేందుకు సిద్ధ‌మైన ఎన్టీఆర్‌!?

August 6, 2021 at 12:06 pm

ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని కొర‌టాల శివ‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్‌లో ఇది 30వ చిత్రంగా తెర‌కెక్క‌నుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు.

ఇక త్వ‌ర‌లోనే ఈ మూవీ సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. ప్ర‌స్తుతం ఈ మూవీ కోసం కొర‌టాల న‌టీన‌టుల‌ను ఎంపిక చేసే ప‌నిలో బిజీ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ రెగ్యుల‌ర్‌గా కంటే మ‌రింత స‌న్న‌గా, స్టైలిష్‌గా క‌నిపించేందుకు సిద్ధ‌మ‌య్యాడ‌ట‌.

ఈ నేప‌థ్యంలోనే ఆర్ఆర్ఆర్ పూర్తి అయిన అనంత‌రం.. ఎన్టీఆర్‌ ప్రత్యేక డైట్, స్పెషల్‌ వర్కవుట్స్‌తో బ‌రువు తగ్గే పని మీద ఉంటారని తెలుస్తోంది. కాగా, గ‌తంలో యమ‌దొంగ మూవీ కోసం ఎన్టీఆర్ ఏకంగా 30 కేజీల బ‌రువు త‌గ్గి.. స్లిమ్‌గా క‌నిపించాడు. మ‌ళ్లీ ఇప్పుడు కొర‌టాల మూవీ కోసం తార‌క్ ఎన్ని కేజీల బ‌రువు త‌గ్గుతాడో చూడాల్సి ఉంది.

కొర‌టాల కోసం అలా క‌నిపించేందుకు సిద్ధ‌మైన ఎన్టీఆర్‌!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts