`నార‌ప్ప‌` మేకింగ్ వీడియో..అద‌ర‌హో అనిపించిన‌ వెంకీ!

విక్ట‌రీ వెంక‌టేష్‌, ప్రియ‌మ‌ణి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `నార‌ప్ప‌`. శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని వి క్రియేషన్స్‌, సురేశ్‌ ప్రొడక్షన్స్ బ్యాన‌ర్ల‌పై కలైపులి ఎస్. థాను, డి.సురేశ్‌బాబు సంయుక్తంగా నిర్మించారు. అలాగే ఈ చిత్రంలో శ్రీ తేజ్, కార్తిక్ రత్నం, నాజర్, రావు రమేష్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు.

ఇక క‌రోనా ప‌రిస్థితులు కార‌ణంగా ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌లైన నార‌ప్ప‌.. మంచి టాక్ తెచ్చుకుంది. సెల‌బ్రెటీలు సైతం నార‌ప్ప‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా మేకింగ్ వీడియోను తాజాగా అమెజాన్ ప్రైమ్ విడుద‌ల చేసింది.

నార‌ప్పలోని యాక్ష‌న్ స‌న్నివేశాల్లో వెంకీ ప‌డిన క‌ష్ట‌మంతా ఈ మేకింగ్ వీడియోలో స్ప‌ష్టంగా క‌నిపించింది. అలాగే రౌడీల పై ఎగబడుతూ కత్తి దూస్తూన్న వెంకటేష్‌‌‌ను చూస్తే నిజంగానే ఒళ్ళు జలదరిస్తుంది. మొత్తానికి త‌న‌దైన న‌ట‌న‌తో, ఫైట్స్‌తో వెంకీ అంద‌రి చేత అద‌ర‌హో అనిపించారు.