బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సుధీర్గ ప్రేమాయణం తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని 2017లో పెళ్లి చేసుకుంది అనుష్క. ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో జరిగిన వీరి పెళ్లి అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది.
పెళ్లి తర్వాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న అనుష్క.. ఇటీవలె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇదిలా ఉంటే.. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరిగే సౌంతిప్టన్‌లో ఉన్న అనుష్క.. అక్కడ దిగిన ఓ ఫొటోను షోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఈ ఫొటోలో వెనుక క్రికెట్ స్టేడియం కనిపించగా.. ముందు అనుష్క క్యూట్ స్మైల్ ఇస్తూ కనిపించింది.
ప్రస్తుతం ఈ ఫొటో తెగ వైరల్ అవుతోంది. అయితే అందరి దృష్టి ఈ ఫొటోలో ఆమె వేసుకున్న చెప్పులపైనే పడింది. వైట్ కలర్ సాక్సులు వేసుకుని, గూచీ చెప్పులు వేసుకుంది అనుష్క. ఎందుకంటే ఆ చెప్పుల ధర 436 డాలర్లు అంటే అక్షరాల 31,892 రూపాయలు. ఇక చెప్పుల ధరే ఇంత ఉంటే.. అనుష్క ధరించే బట్టల ధర ఇంకెంత ఉంటాయో అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.