కమలా హారిస్‌కు తప్పిన పెను ప్రమాదం..ఏం జ‌రిగిందంటే?

June 7, 2021 at 11:55 am

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పెను ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్నారు. ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె తాజాగా తొలిసారి విదేశీ పర్యటకు పయనమయ్యారు. మేరీల్యాండ్ నుంచి గ్వాటెమాల‌కు ఎయిర్‌ఫోర్స్-2 విమానం బయల్దేరారు.

అయితే విమానం గాల్లో ఉండగానే… సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే విమానం.. వెనక్కి తిరిగొచ్చి అత్యవసరంగా ల్యాండ్ అయింది. పైలట్ ముందుగానే లోపాన్ని గుర్తించడంతో ప్రమాదం తప్పింది.

అనంత‌రం తాను క్షేమంగా ఉన్నానని కమలా హ్యారిస్ మీడియాకు తెలిపారు. ఇక ఆ వెంట‌నే మరో విమానంలో ఆమె గ్వాటెమాల‌కు వెళ్లారు. కాగా, కమలా హ్యారిస్ ఈ వారం గ్వాటెమాల‌, మెక్సికోలో పర్యటించనున్నారు.

కమలా హారిస్‌కు తప్పిన పెను ప్రమాదం..ఏం జ‌రిగిందంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts