`అఖండ` విడుద‌ల అప్ప‌టికి షిఫ్ట్ అయింద‌ట‌?!

June 7, 2021 at 10:49 am

నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం అఖండ‌. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా పూర్ణ కీల‌క పాత్ర పోషిస్తోంది. ఈ యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు.

తొలుత ఈ సినిమాని నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని మే 28న విడుదల చేయాలనుకున్నారు. కానీ, క‌రోనా సెకెండ్ కార‌ణంగా విడుద‌ల‌కు బ్రేక్ ప‌డింది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం అఖండ విడుద‌ల‌ను సెప్టెంబ‌ర్‌కు షిప్ట్ చేశార‌ట మేక‌ర్స్‌.

ఈలోపు బ్యాలెన్స్ షూటింగ్ మ‌రియు ఇతర ప‌నుల‌ను కూడా పూర్తి చేసుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. కాగా, ఈ చిత్రంలో శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపించ‌నున్న‌ట్టు స‌మాచారం.

`అఖండ` విడుద‌ల అప్ప‌టికి షిఫ్ట్ అయింద‌ట‌?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts