కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి అని అనుకున్నారు. కానీ, రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,287 పాజిటివ్ […]
Tag: Latest news
కాంస్యం సాధించి చరిత్ర సృష్టించిన సింధు..!!
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ లో అదరగొట్టి.. మన దేశానికి మరో మెడల్ సాధించిపెట్టింది. సెమీఫైనల్స్‌లో ఓడిన ఇద్దరు ప్లేయర్స్ మధ్య కాంస్యం కోసం జరిగిన మ్యాచ్‌లో సింధు ఘనవిజయం సాధించి శభాష్ అనిపించుకుంది. సింధు 21-13, 21-15 తేడాతో చైనా క్రీడాకారిణి బింగ్ జియావోపై గెలుపొందింది. సెమీస్‌లో ఓడినందుకు ఒత్తిడికి గురైనా.. ఎక్కడా తడబాటు లేకుండా ప్రత్యర్థిపై పైచేయి సాధిస్తూ గేమ్‌ను అద్భుతంగా ఫినిష్ చేసింది. ఇక ఈ విజయంతో […]
`ఫ్రెండ్షిప్ డే`ను ఎనిమీ డే మార్చిన ఆర్జీవీ..నెటిజన్లు ఫైర్!
నేడు ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అందరూ తమ తమ మిత్రులతో కలిసి ఈ ప్రత్యేకమైన రోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే తాజాగా టాలీవుడ్ సంచలన దర్శకుడు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ.. ఫ్రెండ్షిప్ డే పై వివాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో హాట్ టాపిక్‌గా మారింది. `స్నేహితుడికి సాయం చేస్తే ఓ సమస్య వస్తుంది. వాడికి మరోసారి సాయం అవసరమైనప్పుడు కూడా మళ్లీ నీ దగ్గరికే […]
తల్లి కాబోతున్న ప్రభాస్ హీరోయిన్..పిక్స్ వైరల్?!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, రణ్‌వీర్ సింగ్ భార్య దీపిక పదుకోనె తల్లి కాబోతోందనే వార్త ప్రస్తుతం నెట్టంట వైరల్‌గా మారింది. ఉన్నట్టు ఉంది ఈ ప్రచారం జగడానికి కారణం లేకపోలేదు. రణవీర్, దీపిక శుక్రవారం సాయంత్రం ముంబైలోని హిందూజా ఆసుపత్రి నుండి బయటకు వస్తూ మీడియా కంట పడ్డారు. దాంతో దీపికా ప్రెగ్నెంట్ అనీ, అందుకే చకప్ కోసం భర్తతో హాస్పటల్‌కి వెళ్లిందనే ప్రచారం ఊపందుకుంది. మరి తాజా ప్రచారం ఎంత వరకు నిజమో తెలియంటే.. దీపిక […]
మల్టీస్టారర్‌గా చిరు-బాబీ సినిమా..కథ అదేనట?!
మెగాస్టార్ చిరంజీవి, టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ బాబీ కాంబోలో త్వరలోనే ఓ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. అయితే ఈ చిత్రం ఓ మల్టీస్టారర్ అని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని బాబీ కూడా ధృవీకరించాడు. తాజాగా బాబీ చిరు సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ విషయం బయట పెట్టారు. ఇది ఓ స్టార్ […]
ఎన్టీఆర్‌కు నో చెప్పిన కియారా..కారణం అదేనా?
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్ 30వ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కబోతోంది. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ మూవీలో ఎన్టీఆర్‌కు జోడీగా బాలీవుడ్ భామ కియారా అద్వానీని తీసుకోవాలని కొరటాల భావించారు. ఈ నేపథ్యంలోనే […]
అదిరిపోయిన `ఆర్ఆర్ఆర్` ఫస్ట్ సింగిల్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ `ఆర్ఆర్ఆర్`. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌తో నిర్మిస్తున్నారు. ఎం.ఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. అయితే ఈ రోజు ఫెండ్షిప్ డే సందర్భంగా.. ఆర్ఆర్ఆర్ ఫస్ట్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సాంగ్ ఒకేసారి […]
`ఫ్రెండ్‌షిప్ డే` గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?
ఈ ప్రపంచంలో అత్యంత గొప్ప బంధం ఏదైనా ఉందా అంటే అది స్నేహబంధమే. కన్న తల్లిదండ్రులు, రక్తం పంచుకున్న తోబుట్టువులు, బంధువులు తోడు ఉంటారో లేదో తెలియదు గానీ.. స్నేహితుడు మాత్రం ఎప్పుడూ మనతోనే ఉంటాడు. సుఖాల్లోనే కాదు కష్టాల్లోనూ అండగా నిలుస్తాడు. అందుకే నిజమైన స్నేహితుడు ఒక్కడున్నా.. జీవితం ఎంతో అద్భతంగా, అందంగా ఉంటుంది. ఇక ఎల్లలు లేని స్నేహానికి గుర్తుగా ప్రతి ఏటా ఆగస్టు మొదటి ఆదివారాన్ని ఫ్రెండ్‌షిప్ డే గా సెలబ్రేట్ చేసుకుంటారు. […]
దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి..తాజా కేసులెన్నంటే?
ఎక్కడో చైనాలో పుట్టిన అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి తగ్గుతూ వస్తోంది. భారత్‌లోనూ కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే గత మూడు రోజుల నుంచి మాత్రం దేశంలో కరోనా కేసులు మళ్లీ ఊపందుకోగా.. నిన్న కూడా భారీగా నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో […]









