అదిరిపోయిన `ఆర్ఆర్ఆర్‌` ఫ‌స్ట్ సింగిల్‌!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తున్న తాజా మ‌ల్టీస్టార‌ర్ `ఆర్ఆర్ఆర్‌`. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌తో నిర్మిస్తున్నారు. ఎం.ఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం స‌మ‌కూర్చారు. అయితే ఈ రోజు ఫెండ్షిప్ డే సంద‌ర్భంగా.. ఆర్ఆర్ఆర్ ఫ‌స్ట్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సాంగ్ ఒకేసారి విడుదల అయింది. ఐదు భాషల్లోనూ బాణీ ఒక్కటే. కానీ, గాత్రం మాత్రం వేర్వేరు. అనిరుధ్ రవిచంద్రన్, అమిత్ త్రివేది, విజయ్ ఏసుదాసు, యాజిన్ నజీర్ వంటి ఐదుగురు ప్రముఖ సింగర్స్ ఈ సాంగ్ ను పాడారు. తెలుగు వెర్సన్ పాటను హేమచంద్ర ఆలపించగా.. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు.

ఇద్ద‌రు భిన్న‌మైన మ‌న‌స్కుల మ‌ధ్య ఉన్న స్నేహాన్ని తెలియ‌జేసేలా సాగిన ఈ పాట‌ అదిరిపోయింద‌ని చెప్పాలి. ఆధ్యంతం ఆక‌ట్టుకుంటున్న ఈ సాంగ్ విడుద‌లైన కొన్ని నిమిషాల్లోనే ట్రెండింగ్‌లోకి వ‌చ్చేసింది. మ‌రి ఆ సాంగ్‌పై మీరూ ఓ లుక్కేసేయండి. కాగా, షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఆర్ఆర్ఆర్‌.. అక్టోబ‌ర్ 13న విడుద‌ల కానుంది.