హీరోయిన్ రంభ భర్త ఎవరో తెలుసా ?

సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది నటులు అలా వచ్చి ఇలా తళుక్కుమని మెరిసి, కొంతకాలం స్టార్ పొజిషన్ను అనుభవించి, సినీ ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటారు.. ముఖ్యంగా అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ హోదాను అనుభవించిన స్టార్ హీరోయిన్ల లిస్టులో రంభ కూడా ఒకరు. ఈమె తన నటనతో, అందంతో, అమాయకపు మాటలతో ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసింది. అప్పట్లో తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసి కుర్రకారును తనవైపు తిప్పుకున్న ఈ భామ ఎందుకో తెలియని కారణాల చేత సినీ ఇండస్ట్రీకి దూరం కావాల్సి వచ్చింది. అయితే మనం ఇప్పుడు ఈమె గురించి ఈమె భర్త గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. Rambha: భర్త, పిల్లలతో అందాల తార రంభ .. Rambha Photo : Twitter

అలనాటి తార రంభ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ నుంచి తమిళ, బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు కూడా తన అడుగులు కొనసాగించుకుంటూ వెళ్ళింది. ఇక ఈమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విజయవాడలో జన్మించడం జరిగింది. ఈమె అసలు పేరు విజయలక్ష్మి. ఇక ఈమె సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మాత్రమే కాకుండా ఐటమ్ గర్ల్ గా కూడా కొన్ని పాటలకు స్టెప్పులేసింది. తన పిల్లలతో రంభ Photo : Twitter

రంభ అనేక సినిమాలలో నటించి, తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ ను తెచ్చుకుంది. ఇక రాను రాను సినిమా అవకాశాలు తగ్గడంతో రంభ 2010 లో ఇంద్ర కుమార్ అనే ఒక మలేషియన్ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకున్నది. ఇక ఆ తర్వాత వీరికి ఇద్దరు కుమార్తెలు , ఒక కుమారుడు నిర్మించాడు. ఇక ప్రస్తుతం కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉన్నట్లు తెలుస్తోంది.