మ‌హేష్ ఖాతాలో మ‌రో అదిరిపోయే రికార్డ్‌..!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేస్ బాబు ఖాతాలో మ‌రో అదిరిపోయే రికార్డ్ వ‌చ్చి ప‌డింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మ‌హేష్, ప‌రుశురామ్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. ఎంబీ ఎంటర్టైన్‌మెంట్స్, 14 రీల్స్ ప్లాస్‌, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మ‌హేష్‌కు జోడీగా కీర్తి సురేష్ న‌టిస్తోంది. అయితే నిన్న ఈ సినిమా నుంచి మ‌హేష్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన […]

మూడేళ్లుగా వేధిస్తూనే ఉన్నారు..ప్రియా వారియర్ ఆవేద‌న‌!?

కనుసైగలతో అంతర్జాల ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన మలయాళ ముద్దుగుమ్మ‌ ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. చెక్ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. తాజాగా తేజ స‌జ్జ హీరోగా తెర‌కెక్కిన ఇష్క్ మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. జూలై 30న థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొన్న‌ ప్రియా వారియ‌ర్.. సోష‌ల్ మీడియా వేదిక‌గా వేధింపుల‌కు గురిచేస్తున్న నెటిజ‌న్ల‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. […]

బాత్ ట‌బ్‌లో రెచ్చిపోయిన `వ‌కీల్ సాబ్‌` భామ..పిక్స్ వైర‌ల్‌!

అనన్య నాగళ్ల.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మల్లేశం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అన‌న్య‌.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా తెర‌కెక్కిన వ‌కీల్ సాబ్ చిత్రంలో కీల‌క పాత్ర పోషించి సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమా త‌ర్వాత మ‌రిన్ని అవ‌కాశాలు అందుకుంటున్న‌ అన‌న్య‌.. మ‌రోవైపు హాట్ హాట్ ఫొటో షూట్లు చేస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ర‌చ్చ ర‌చ్చ చేస్తోంది. ఇక తాజాగా ఈ భామ‌.. వైట్ షార్ట్ ఫ్రాక్ […]

చిరుకి త‌ల‌నొప్పిగా మారిన చ‌ర‌ణ్‌..మ్యాట‌ర్ ఏంటంటే?

మెగ‌స్టార్ చిరంజీవికి త‌న త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ త‌ల‌నొప్పిగా మార‌డం ఏంటీ..? అన్న సందేహం మీకు వ‌చ్చే ఉంటుంది. అది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా.. కాజ‌ల్‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. నిజానికి ఈ చిత్రం మేలోనే విడుద‌ల కావాల్సి ఉంది. కానీ, క‌రోనా కార‌ణంగా షూటింగ్ ఆగిపోవ‌డంతో.. విడుద‌ల ఆగిపోయింది. […]

ఏపీలో స్వ‌ల్పంగా క్షీణించిన క‌రోనా కేసులు..23 మంది మృతి!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్ప‌టిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. ప్ర‌స్తుతం ఏపీలో మూడు వేల‌కు లోపుగా రోజూవారి కేసులు న‌మోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,058 […]

చివరి వరకు పోరాడిన తెలుగు తేజం.. హోరాహోరీ పోరులో సింధు ఓటమి

టోక్యో వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ సెమీస్‌లో తెలుగు తేజం పీవీ సింధు చివరి వరకు పోరాడింది. భారత్ తరఫున విజయ పతాకం ఎగురవేసేందుకు కృషి చేసింది. కానీ, చివరకు ఓటమి పాలైంది. చైనాకు చెందిన తై జు యింగ్, సింధు మధ్య తొలి సెట్ పోరు రసవత్తరంగా నడిచింది. మొదట్లో తై జుయింగ్ పై పీవీ సింధు ఆధిక్యం కనబరిచినప్పటికీ చివరలో వెనక పడింది. తొలి సెట్‌లో ఇద్దరు ప్లేయర్స్ పీవీ సింధు, తై జు […]

రికార్డ్ ధరకు ‘సర్కారు వారి పాట ‘ ఆడియో రైట్స్.?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రం కోసం మహేశ్ ఫ్యాన్స్, సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ‘గీతా గోవిందం’ ఫేమ్ డైరెక్టర్ పరశుమరామ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రంలో మహేశ్‌కు జోడీగా బ్యూటిఫుల్ హీరోయిన్ కీర్తి సురేశ్ నటిస్తోంది. కాగా, ఈ సినిమా అప్‌డేట్ కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లోనూ ఈ మూవీ గురించి చర్చ జరుగుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా […]

బాలీవుడ్ స్టార్ హీరోతో న‌భా న‌టేష్ రొమాన్స్‌..త్వ‌ర‌లోనే..?

న‌భా న‌టేష్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఇస్మార్ట్ శంక‌ర్ మూవీతో భారీ క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ‌.. ప్రస్తుతం క్రేజీ ఆఫ‌ర్లు అందుకుంటూ దూసుకుపోతోంది. నితిన్ హీరోగా తెర‌కెక్కిన మాస్ట్రో చిత్రంలో న‌భానే హీరోయిన్‌గా న‌టించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అయితే ఇప్పుడు ఈ భామ బాలీవుడ్ స్టార్ హీరోతో రొమాన్స్ చేసే అవ‌కాశాన్ని అందుకున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇంత‌కీ ఆ హీరో ఎవ‌రో కాదు..హృతిక్ రోషన్. […]

భారీ ధ‌ర ప‌లికిన ప‌వ‌న్-రానా మూవీ డబ్బింగ్ రైట్స్?!

సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, రానా ద‌గ్గుబాటి క‌లిసి న‌టిస్తున్న తాజా మ‌ల్టీస్టార‌ర్ `అయ్యప్పనుం కోషియం` రీమేక్. సితార ఎంటర్‌టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ మ‌రియు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు జోడీగా నిత్యా మీన‌న్ న‌టిస్తోంది. ఇక క‌రోనా సెకెండ్ వేవ్ త‌ర్వాత ఇటీవ‌లె ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్ల‌గా.. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా […]