అరియానాను వ‌ద‌ల‌ని బిగ్‌బాస్‌..సీజ‌న్ 5లో బంప‌ర్ ఛాన్స్‌?!

అరియానా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. యాంక‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో అడుగు పెట్టి తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపుల‌ర్ అయింది. ఈ షో త‌ర్వాత టీవీ షోలే కాకుండా.. సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌లోనూ అవ‌కాశాలు ద‌క్కించుకుంటున్న అరియానాను బిగ్ బాస్ మాత్రం వ‌దిలి పెట్ట‌డం లేదు. అవును, త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ 5లోనూ అరియానా అల‌రించ‌బోతోంది. పూర్తి వివ‌రాల్లోకి […]

కన్‌ప్యూజ్ చేస్తున్న ప్ర‌కాశ్ రాజ్‌..వైర‌ల్‌గా మారిన ట్వీట్‌!

విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ ఈ మ‌ధ్య త‌ర‌చూ ఏదో ఒక విష‌యంపై వార్త‌ల్లో నిలుస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నిక‌ల బ‌రిలో దిగిన‌ప్ప‌టి నుంచీ ప్ర‌కాశ్ రాజ్ ఏం మాట్లాడినా.. సోష‌ల్ మీడియాలో ఏం పోస్ట్ చేసినా తెగ వైర‌ల్ అయిపోతున్నాయి. తాజాగా కూడా ఇదే జ‌రిగింది. జస్ట్ రెండే రెండు పదాల్లో ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. `జెండా ఎగరేస్తాం…..` అంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌కాశ్ రాజ్ […]

ఏపీలో కొత్త‌గా 1,535 కరోనా కేసులు..మ‌ర‌ణాలెన్నంటే?

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. మొన్న‌టితో పోలిస్తే.. నిన్న క‌రోనా కేసులు మ‌రింత‌ దిగొచ్చాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,535 పాజిటివ్ కేసులు […]

చిరు బ‌ర్త్‌డేకి ఫిక్సైన ఎన్టీఆర్‌..ఫుల్ ఎగ్జైట్‌గా ఫ్యాన్స్‌!

ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాల‌తో బిజీగా ఉన్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. `ఎవరు మీలో కోటీశ్వరులు` అనే రియాలిటీ షోతో బుల్లితెర‌పై సంద‌డి చేసేందుకు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ టీవీ ఛానెల్ జెమినీలో ఈ షో ప్ర‌సారం కాబోతోంది. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్లు, ప్రోమోలో షోపై భారీ హైప్ క్రియేట్ చేయ‌డంతో.. అభిమానులు, ప్రేక్ష‌కుల‌కు ఈ షో ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎగ్జైట్‌గా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ షో ప్రారంభ తేదీని మేక‌ర్స్ […]

అక్కినేని హీరోకి పూజా హెగ్డే సాయం..అస‌లు మ్యాట‌రేంటంటే?

అక్కినేని హీరో సుశాంత్‌కు సాయం చేసింది పొడుగు కాళ్ల సుంద‌రి పూజా హెగ్డే. ఇంత‌కీ సుశాంత్ బుట్ట‌బొమ్మ ఏం సాయం చేసింద‌నేగా మీ సందేహం..! అది తెలియాలంటే ఆల‌స్యం చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సింది. సుశాంత్, మీనాక్షి చౌద‌రి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ఇచ్చట వాహనములు నిలుపరాదు`. ఎస్‌.ద‌ర్శ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని ఏఐ స్టూడియోస్‌, శాస్త్ర మూవీస్ బ్యాన‌ర్స్‌పై ర‌వి శంక‌ర్ శాస్త్రి, ఎక్తా శాస్త్రి, హ‌రీశ్ కోయ‌ల గుండ్ల సంయుక్తంగా నిర్మించారు. ఈ […]

మ‌హేష్ ప్లానే ప్లాను..ఒకేసారి రెండు ప‌నులు కానిచ్చేస్తున్నాడుగా!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌నవరి 13న విడుద‌ల చేయ‌నున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌. ఇక ఇటీవల హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసిన స‌ర్కారు వారి పాట టీమ్‌.. వెంటనే గోవాలో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. ప్ర‌స్తుతం ఈ మూవీ తాజా […]

ధోనీని పీఎం చేసేసిన‌ విజ‌య్ అభిమానులు..వివాదంగా పోస్టర్లు!

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ ద‌ళ‌ప‌తి అభిమానుల‌పై టీమిండియా మాజీ సారథి, సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మండిప‌డుతున్నారు. అస‌లు ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. మొన్నీమ‌ధ్య విజ‌య్ న‌టిస్తున్న `బీస్ట్‌` సెట్స్‌లో ధోనీ వ‌చ్చి సంద‌డి చేసిన విష‌యం తెలిసిందే. షూటింగ్ స్పాట్ కు వెళ్లిన ధోనీకి విజయ్ సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరువురు అనేక అంశాలపై మాట్లాడుకున్నారు. ఇక వీరిద్ద‌రికీ సంబంధించిన పిక్స్ నెట్టింట తెగ వైర‌ల్ అయ్యాయి. అయితే ఆ […]

భార‌త్‌లో స్వ‌ల్పంగా త‌గ్గిన క‌రోనా కేసులు..478 మంది మృతి!

ఎక్క‌డో చైనాలో పుట్టిన అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి నెమ్మ‌దిస్తోంది. భార‌త్‌లోనూ పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతూ వ‌స్తున్నాయి అనుకుంటున్న‌ త‌రుణంలో.. మ‌ళ్లీ క‌రోనా స్పీడ్ పెంచింది. అయితే నిన్న మాత్రం క‌రోనా కేసులు స్వ‌ల్పంగా దిగి వ‌చ్చాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 38,667 మందికి […]

గెట్ రెడీ..చిరు బ‌ర్త్‌డేకి గ‌ట్టిగానే ప్లాన్ చేస్తున్నార‌ట‌?!

ఆగ‌స్టు 22 అంటే మెగా అభిమానులకు ఎంతో ప్ర‌త్యేక‌మైన రోజు. ఎందుకంటే, మెగాస్టార్ చిరంజీవి పుట్టింది ఆ రోజే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో కిందిస్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి.. కోట్ల మంది ప్రజలను తన అభిమానులుగా మార్చుకున్న ఘనత చిరు సొంతం. అటువంటి వ్య‌క్తి బ‌ర్త్‌డేను మెగా అభిమానులు ఓ పండ‌గ‌లా సెల‌బ్రేట్ చేసుకుంటుంటారు. మ‌రోవైపు చిరు బ‌ర్త్‌డేకి ఆయ‌న న‌టిస్తున్న సినిమాల నుంచీ అదిరిపోయే అప్డేట్స్‌ వ‌స్తూ ఉంటాయి. అయితే ఈ సారి […]