అరియానాను వ‌ద‌ల‌ని బిగ్‌బాస్‌..సీజ‌న్ 5లో బంప‌ర్ ఛాన్స్‌?!

అరియానా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. యాంక‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో అడుగు పెట్టి తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపుల‌ర్ అయింది. ఈ షో త‌ర్వాత టీవీ షోలే కాకుండా.. సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌లోనూ అవ‌కాశాలు ద‌క్కించుకుంటున్న అరియానాను బిగ్ బాస్ మాత్రం వ‌దిలి పెట్ట‌డం లేదు.

Bigg Boss Telugu 4 fame Ariyana Glory shares a fangirl moment with  Nagarjuna Akkineni; see pic - Times of India

అవును, త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ 5లోనూ అరియానా అల‌రించ‌బోతోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. బిగ్‌బాస్‌కు సీక్వెన్స్‌గా బిగ్‌బాస్‌ బజ్‌ అనే మరో షోను కూడా స్టార్ మా వారు నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల‌ను ఇంట‌ర్వ్యూ చేస్తారు.

Ariyana Glory (Anchor) Wiki, Age, Boyfriend, Family, Career & Biography

అయితే ఈ షోకు హోస్ట్‌గా హౌజ్‌లో అంత్యంత క్రేజ్‌ సంపాదించుకున్న కంటెస్టెంట్‌ను ఎంపిక్ చేస్తారు నిర్వహకులు. గత సీజన్ల‌లో హీరో తనిష్‌, రాహుల్‌ సిప్లీగంజ్‌లు హోస్ట్‌గా వ్యవహరించారు. ఇక‌ ఈ సారి బిగ్‌బాస్‌ బజ్‌కు హోస్ట్ వ్య‌వ‌హ‌రించే బంప‌ర్ ఛాన్స్‌ను అరియానా కొట్టేసిన‌ట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మ‌రి ఇందులో నిజ‌మెంతో తెలియాలంటే మ‌రికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.