వైరల్ అవుతున్న బిగ్ బాస్ సీజన్ 5 ప్రోమో..!

August 14, 2021 at 9:07 pm

మా టీవీలో బిగ్ బాస్ సీజన్స్ చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే ఇప్పటివరకు ఈ బిగ్ బాస్ నాలుగు సీజన్ లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక త్వరలో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ప్రారంభం కానున్న సంగతి అందరికీ తెలిసిందే.ఇక ఈ సీజన్ కోసం ప్రేక్షకులు గత కొద్ది నెలల నుంచి ఎదురుచూస్తున్నారు.అయితే తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ సీజన్ 5 సెప్టెంబర్ నెల మొదటి వారంలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సీజన్ కి అక్కినేని నాగార్జున యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే ఈ రియాల్టీ షో కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో నాగార్జున అదరగొట్టేశాడు అని చెప్పవచ్చు.

ఇక ఇప్పటికే ఇందులో పలు సెలబ్రిటీలు కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. వారి పేర్లు ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో కొంతమంది యూట్యూబ్ స్టార్స్ ,మరికొంతమంది యాక్టర్స్ కూడా పేర్లు బయటకు రావడం గమనార్హం. ఇక ఈ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్స్ లుగా ఎవరెవరు అడుగుపెడుతున్నారో వారి పేర్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది.

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో పోటీ పడడానికి యాంకర్ రవి, వర్షిని ,లోబో, సీరియల్ యాక్టర్స్ నవ్య స్వామి, యూట్యూబ్ ఫేమ్ షన్ను, నిఖిల్, హీరోయిన్ ఇషా చావ్లా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు సురేఖవాణి, ప్రియా, వై టీ ఛానల్ నుంచి హే సిరి పాల్గొంటున్నారు.https://twitter.com/iamnagarjuna/status/1426523175458787330?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1426523175458787330%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugustop.com%2Fbiggboss-season-5-latest-promo-released-e0b0a8e0b0bee0b097e0b0bee0b0b0e0b18de0b09ce0b181e0b0a8

వైరల్ అవుతున్న బిగ్ బాస్ సీజన్ 5 ప్రోమో..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts