ఆ రోజు నుంచే ప్రసారం కాబోతున్న ఎన్టీఆర్ షో..

August 14, 2021 at 8:36 pm

ఎన్టీఆర్ షో అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది మీలో ఎవరు కోటీశ్వరులు.. ఈ షో తో ఇటీవల బుల్లితెర పై కూడా బాగా పాపులారిటీని తెచ్చుకుంటున్నాడు ఎన్టీఆర్.. ఈ షోలో సామాన్యులకు కూడా ప్రవేశం కల్పించబడుతుంది. అంతే కాదు ఎంతో మంది తమ కలలను సహకారం చేసుకోవడం కోసం ఈ షోలో అడుగుపెట్టి , తమ ప్రతిభతో కోటి రూపాయలను గెలుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇకపోతే త్వరలో జెమినీ టీవీలో ప్రసారం కాబోతోన్న ఎవరు మీలో కోటీశ్వరులు షోకి వ్యాఖ్యాతగా ఎన్టీఆర్ వ్యవహరిస్తున్నారు..

ఇటీవల ఈ ప్రోగ్రాం కి సంబంధించిన ఒక ప్రోమో విడుదల అయ్యి నెట్టింట్లో వైరల్ గా మారిన విషయం తెలిసిందే.. ఇకపోతే గత కొద్ది నిమిషాల ముందు ఈ ప్రోగ్రాం ఎప్పుడు మొదలవుతుంది.. అనే విషయాలను కూడా ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేయడం జరిగింది.

తాజాగా ఈ షో కి సంబంధించిన ఈ వీడియోలో ఎన్టీఆర్.. ఈనెల 23వ తేదీ నుంచి సోమవారం నుంచి గురువారం వరకు..ప్రతిరోజు రాత్రి 8 గంటల 30 నిమిషాలకు జెమినీ టీవీలో ఈ షో లో ప్రసారమవుతుంది అని తెలిపారు. ఈ విషయం తెలుపుతూ.. ఒక స్పెషల్ ప్రోమో కూడా విడుదల అవ్వడం జరిగింది.. ఇక అందులో ఎన్టీఆర్.. ప్రతి ఇంటికి వచ్చేస్తున్నా.. అంటూ తెలియజేశాడు..ఇక ఎంతగానో ఎదురు చూస్తున్న బుల్లితెర ప్రేక్షకులకు ఇదొక శుభవార్త అని చెప్పవచ్చు.https://youtu.be/MjwgKOqqj-M

ఆ రోజు నుంచే ప్రసారం కాబోతున్న ఎన్టీఆర్ షో..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts