కన్‌ప్యూజ్ చేస్తున్న ప్ర‌కాశ్ రాజ్‌..వైర‌ల్‌గా మారిన ట్వీట్‌!

August 14, 2021 at 6:21 pm

విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ ఈ మ‌ధ్య త‌ర‌చూ ఏదో ఒక విష‌యంపై వార్త‌ల్లో నిలుస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నిక‌ల బ‌రిలో దిగిన‌ప్ప‌టి నుంచీ ప్ర‌కాశ్ రాజ్ ఏం మాట్లాడినా.. సోష‌ల్ మీడియాలో ఏం పోస్ట్ చేసినా తెగ వైర‌ల్ అయిపోతున్నాయి.

తాజాగా కూడా ఇదే జ‌రిగింది. జస్ట్ రెండే రెండు పదాల్లో ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. `జెండా ఎగరేస్తాం…..` అంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌కాశ్ రాజ్ ట్వీట్ చేశారు. కన్‌ప్యూజ్ చేస్తున్న ఈ ట్వీట్ స్వాతంత్ర్య దినోత్సవం(ఆగ‌ష్టు 1)ను ఉద్దేశించి చేశారో.. లేక త్వ‌ర‌లోనే జరగబోయే ‘మా’ ఎన్నికల్లో ఖచ్చితంగా విజ‌యం సాధించి జెండా ఎగరేస్తాం అనే అర్థం వచ్చేలా చేశారో తెలియదు.

కానీ.. ప్రస్తుతానికైతే ఈ ట్వీట్‌పై తెలుగు ఇండ‌స్ట్రీలో తెగ‌ చర్చలు నడుస్తున్నాయి. కాగా, మెన్నీమ‌ధ్య ధనుష్ సినిమా షూటింగ్‌లో ప్ర‌కాశ్ రాజ్ గాయ‌ప‌డిన విష‌యం తెలిసిందే. మంగళవారం చిత్రీకరణలో పాల్గొన్న ఆయన ప్రమాదానికి గురయ్యారు. చేతికి గాయమవడంతో మెరుగైన చికిత్స కోసం చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి స‌ర్జ‌రీ చేయించుకున్నారు. ప్ర‌స్తుతం ఆయన ఆరోగ్యం మెరుగ్గానే ఉంది.

కన్‌ప్యూజ్ చేస్తున్న ప్ర‌కాశ్ రాజ్‌..వైర‌ల్‌గా మారిన ట్వీట్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts