తన వయసు ఎంతో చెప్పిన రష్మీ..?

ప్రతి వారం ప్రేక్షకులకు వినోదాన్ని పంచే ఎన్నో షో లలో “ఢీ ” ప్రోగ్రామ్ కూడా. ఈ ప్రోగ్రాంలో కళ్ళు చెదిరే డాన్స్ లతో అదిరిపోయే స్టెప్పులు తో, కడుపుబ్బా నవ్వించే యాంకర్ లలో, కామెడీ చేసే జడ్జి లతో ఢీ సెట్ అంతా హడావిడీ గా వుంటుంది. ఇకపోతే ఈ వారం రెట్టింపు సందడిచేసేందుకు సిద్ధమవుతోంది ఈ షో. ఇక ఎంటర్టైన్మెంట్ ఏ స్థాయిలో ఉంటుందో ఆలోచించండి..? తాజాగా ఈ షో కి సంబంధించిన ఒక ప్రోమో విడుదలయ్యింది.

ఎప్పటిలాగే దుమ్మురేపే కంటెస్టెంట్ లతో, స్టేజ్ మీదకు ఎన్నో జోడీలు వస్తున్నాయి. అంతేకాకుండా కావాల్సినంత కామెడీ తో టీం లీడర్లు.. పోటా పోటీ పడ్డారు. యాంకర్ ప్రదీప్ వార్డెన్ గా.. హాస్టల్లో టీం లీడర్ లు ,కంటెస్టెంట్ లు చేరడానికి వస్తారు. వాళ్ల పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవటానికి యాంకర్ రష్మీ ని పేరు వయస్సు అడిగాడు.. తన పేరు రుచి అని తన వయస్సు 16 అని చెప్పింది. వెంటనే ప్రదీప్ 16 ఒకట్ల లేక పదహారు రెండ్ల..? అని ప్రదీప్ పెద్ద పంచ్ వేశాడు.

ఇక పక్కనే ఉన్న మన సుధీర్ ఊరికే ఉంటాడా..? 16 మూళ్లు వేసిన ఆశ్చర్యపోనవసరం లేదు.అని అలా అనడంతో రష్మీకి ఏమనాలో తెలియక బిక్క మొఖం వేసుకుంది. ఆ తర్వాత హాస్టల్ లో ఉండే మోను చెప్తాడు ప్రదీప్. ఆ మెను విన్న లీడర్స్ అవాక్కయ్యారు.ఇక ఇలా ఈ ప్రోమో చాలా సరదాగా ముగిసింది..