అల‌నాటి అందాల తార శ్రీదేవి ఆస్తుల‌ విలువెంతో తెలిస్తే షాకే!?

అల‌నాటి అందాల తార‌, దివంగ‌త న‌టి శ్రీ‌దేవి గురించి తెలియ‌ని వారుండ‌రు. త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మంత్ర‌ముగ్దుల‌ను చేసిన శ్రీ‌దేవి.. తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్‌, మలయాళం భాషలలో వందలాది సినిమాలు చేసి స్టార్ హీరోయిన్‌గా ఏళ్ల పాటు సినీ ఇండ‌స్ట్రీని ఏలింది. హీరోల డామినేషన్‌ రోజుల్లోనూ వాళ్లకి మించిన ఇమేజ్‌తో రాణించిన ఘనత ఒక్క శ్రీదేవికే దక్కింది. అంతేకాదు, అగ్రహీరోలకు మించిన పారితోషికం అందుకున్న శ్రీ‌దేవి.. ఎన్నో ఆస్తుల‌నూ కూడ‌బెట్టింది. ప్ర‌స్తుతం శ్రీదేవి […]

భ‌ర్త‌తో క‌లిసి వ‌రంగ‌ల్‌లో ర‌చ్చ ర‌చ్చ చేసిన కాజ‌ల్‌..పిక్స్ వైర‌ల్‌!

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ ఈ మ‌ధ్యే ప్రియుడు, ముంబైలో స్థిర‌ప‌డిన వ్యాపారవేత్త గౌత‌మ్ కిచ్లూని వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. షూటింగ్స్ నుంచి గ్యాప్ దొరికిన‌ప్పుడ‌ల్లా భ‌ర్త‌తో ఎంజాయ్ చేసే కాజ‌ల్‌.. తాజాగా వ‌రంగ‌ల్‌లో హ‌ల్‌చ‌ల్ చేసింది. వ‌రంగ‌ల్ టౌన్ లో కాసం పుల్ల‌య్య షాపింగ్ మాల్ ను కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్రారంభించింది. ఎప్పుడూ సింగిల్ గా ఇలాంటి కార్య‌క్ర‌మాల‌కు వెళ్లే కాజ‌ల్..ఈ సారి మాత్రం హైద‌రాబాద్ నుంచి వ‌రంగ‌ల్ […]

త‌మ‌న్నాకు ఆ వంట‌కం అంటే మ‌హా ఇష్ట‌మ‌ట‌..కానీ..?

త‌మ‌న్నా.. ప‌రిచ‌యం అవ‌స‌రంలేని పేరు. దాదాపు 15 ఏళ్ల నుంచి సినీ ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ ఫుల్‌గా కెరీర్‌ను కొన‌సాగిస్తున్న ఈ మిల్కీ బ్యూటీ.. ప్ర‌స్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌తో పాటు హోస్ట్‌గా కూడా మారింది. ఇంటర్‌నేషనల్‌ లెవల్‌లో పాపులర్ అయిన మాస్టర్ చెఫ్ అనే కుక్కింగ్ షో తెలుగు వర్షన్‌కు తమన్నా హోస్ట్‌గా వ్యవహరించ‌బోతుంది. తర్వాలోనే ఈ షో ప్ర‌సారం కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న‌.. ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను షేర్ చేసుకుంది. […]

ఎన్టీఆర్ ఎన‌ర్జీకి ఆయ‌న తోడైతే ఫ్యాన్స్‌కు పండ‌గే పండ‌గ‌?!

ప్రస్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్‌` చిత్రంలో న‌టిస్తున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. త‌న 30వ చిత్రాన్ని కొర‌టాల శివ‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతున్న ఈ చిత్రం పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండ‌బోతోంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి మ‌రో క్రేజీ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. […]

గ్యాప్ ఇవ్వ‌ని మ‌హేష్‌..అదే కావాలంటున్న ఫ్యాన్స్‌!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట‌` చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌నవరి 13న విడుద‌ల చేయ‌నున్నారు. అయితే ఈ మ‌ధ్య స‌ర్కారు వారి పాట‌ నుంచి గ్యాప్ లేకుండా ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. […]

`పుష్ప‌`రాజ్ ఊచ‌కోత షురూ..దుమ్ము దులిపేస్తున్నాడుగా!

టాలీవుడ్ స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బ‌న్నీ పుష్ప‌రాజ్ అనే లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్ గా న‌టిస్తుంటే.. ఫ‌హాద్ ఫాజిల్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కిస్తున్నారు. అయితే ఈ రోజు పుష్ప నుంచి ఫ‌స్ట్ సింగిల్‌ను ఐదు భాష‌ల్లో విడుద‌ల చేసిన విష‌యం […]

ఏపీలో త‌గ్గుతూ వ‌స్తున్న క‌రోనా కేసులు..కొత్త‌గా ఎన్నంటే?

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. మొన్న‌టితో పోలిస్తే.. నిన్న క‌రోనా కేసులు స్వ‌ల్పంగా దిగొచ్చాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,746 పాజిటివ్ కేసులు […]

ఆగస్టు 15 న రాబోతున్న బీమ్లా నాయక్.. !!

పవన్ కళ్యాణ్ పేరు వింటే చాలు అభిమానులకు పండగే పండగే. ఆయన సినిమా రిలీజ్ అంటే చాలు అభిమానుల కోలాహలం మాములుగా ఉండదు. అయితే పవన్ కళ్యాణ్ నటించే కొత్త సినిమా గురించి ఒక మంచి అప్డేట్ వచ్చేసింది. పవన్, రానా కాంబినేషన్‌లో వస్తోన్న తమిళ రీమేక్ చిత్రం అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా మీద అభిమానులు భారీ ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా పూర్తి చేసే […]

అర‌రే..రాధికా ఆప్టేకు ఎంత క‌ష్ట‌మొచ్చింది..ఆడుకుంటున్న నెటిజ‌న్లు!

రాధికా ఆప్టే.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సినిమాల‌కంటే.. వివాదాలు, వివాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తోనే ఫుల్ పాపుల‌ర్ అయింది ఈ హాట్ బ్యూటీ. ప్ర‌స్తుతం బాలీవుడ్ చిత్రాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న ఈ భామ‌కు.. ఓ అనుకోని క‌ష్ట‌మొచ్చి పడింది. ఉన్నట్టుండి ఈ రాధికాపై నెటిజన్లు ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, ‘బైకాట్‌ రాధికా ఆప్టే’ అనే హాష్‌ ట్యాగ్‌ను ట్విట్టర్ లో తెగ ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఇంత హాఠాత్తుగా రాధిక‌తో నెటిజ‌న్లు ఆడుకోవ‌డానికి కార‌ణం […]