`పుష్ప‌`రాజ్ ఊచ‌కోత షురూ..దుమ్ము దులిపేస్తున్నాడుగా!

టాలీవుడ్ స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బ‌న్నీ పుష్ప‌రాజ్ అనే లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్ గా న‌టిస్తుంటే.. ఫ‌హాద్ ఫాజిల్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు.

రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కిస్తున్నారు. అయితే ఈ రోజు పుష్ప నుంచి ఫ‌స్ట్ సింగిల్‌ను ఐదు భాష‌ల్లో విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. `దాక్కో దాక్కో మేక – పులొచ్చి కొరుకుతుంది పీక‌` అంటూ సాగే ఈ సాంగ్ దాదాపు అంద‌రినీ విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. దేవిశ్రీ ప్ర‌సాద్ ట్యూన్‌, బన్నీ డిఫరెంట్ స్టెప్స్, చంద్రబోస్ అందించిన లిరిక్స్ ఆ సాంగ్‌కు స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి.

ఇక ఈ సాంగ్‌ను అలా వ‌దిలారో లేదో.. పుష్ప‌రాజ్ రికార్డు ఊచ‌కోత షురూ చేశాడు. విడుద‌లైన ద‌గ్గ‌ర నుంచి యూట్యూబ్‌లో దుమ్ము దులిపేస్తూ దూసుకుపోతోన్న ఈ సాంగ్‌ 182 నిమిషాల్లోనే 4 లక్షల లైక్స్‌ ను సాధించింది. దాంతో త‌క్కువ స‌మ‌యంలోనే అత్య‌ధిక‌ లైక్స్ సాధించిన ఏకైక లిరిక‌ల్ వీడియో సాంగ్‌గా దాక్కో దాక్కో మేక రికార్డు సృష్టించింది. మ‌రి ముందు ముందు బ‌న్నీ ఖాతాలో ఈ సాంగ్ ఇంకెన్ని రికార్డులు ప‌డేలా చేస్తుందో చూడాలి.