అక్కినేని హీరోకి పూజా హెగ్డే సాయం..అస‌లు మ్యాట‌రేంటంటే?

August 14, 2021 at 2:33 pm

అక్కినేని హీరో సుశాంత్‌కు సాయం చేసింది పొడుగు కాళ్ల సుంద‌రి పూజా హెగ్డే. ఇంత‌కీ సుశాంత్ బుట్ట‌బొమ్మ ఏం సాయం చేసింద‌నేగా మీ సందేహం..! అది తెలియాలంటే ఆల‌స్యం చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సింది. సుశాంత్, మీనాక్షి చౌద‌రి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ఇచ్చట వాహనములు నిలుపరాదు`.

taran adarsh on Twitter: "IN CINEMAS, 27 AUG... #Telugu film  #IchataVahanamuluNilupaRadu - starring #Sushanth - to release in *cinemas*  on 27 Aug 2021... Directed by by S Darshan. #IVNR #IVNRFromAug27th…  https://t.co/L0UdHZYsrz"

ఎస్‌.ద‌ర్శ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని ఏఐ స్టూడియోస్‌, శాస్త్ర మూవీస్ బ్యాన‌ర్స్‌పై ర‌వి శంక‌ర్ శాస్త్రి, ఎక్తా శాస్త్రి, హ‌రీశ్ కోయ‌ల గుండ్ల సంయుక్తంగా నిర్మించారు. ఈ మ‌ధ్యే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగ‌స్టు 27న థియేట‌ర్‌లోకి దిగ‌బోతోంది. విడుద‌ల ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో.. చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్స్ షురూ చేసింది.

Pooja Hegde Shows A New Angle

ఈ నేప‌థ్యంలోనే సినిమాలోని `నీ వల్లే నీ వల్లే..` సాంగ్‌ను పూజా హెగ్డే చేత విడుద‌ల చేయించారు మేక‌ర్స్‌. దాంతో సినిమాపై మ‌రింత హైప్ క్రియేట్ అయింది. మ‌రి ఈ లెక్క‌న పూజా సుశాంత్‌కు సాయం చేసిన‌ట్టే క‌దా. ఇక తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చిన సాంగ్ విష‌యానికి వ‌స్తే.. నీ వల్లే నీ వల్లే.. అంటూ సాగే ఈ సాంగ్ కి శ్రీనివాస మౌళి సాహిత్యం అందించగా, సంజిత్ హెగ్డే ఆలపించాడు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించాడు. ప్ర‌స్తుతం ఈ సాంగ్ ప్రేక్ష‌కుల‌కు బాగానే ఆక‌ట్టుకుంటోంది.

అక్కినేని హీరోకి పూజా హెగ్డే సాయం..అస‌లు మ్యాట‌రేంటంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts