చిరు బ‌ర్త్‌డేకి ఫిక్సైన ఎన్టీఆర్‌..ఫుల్ ఎగ్జైట్‌గా ఫ్యాన్స్‌!

August 14, 2021 at 3:01 pm

ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాల‌తో బిజీగా ఉన్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. `ఎవరు మీలో కోటీశ్వరులు` అనే రియాలిటీ షోతో బుల్లితెర‌పై సంద‌డి చేసేందుకు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ టీవీ ఛానెల్ జెమినీలో ఈ షో ప్ర‌సారం కాబోతోంది. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్లు, ప్రోమోలో షోపై భారీ హైప్ క్రియేట్ చేయ‌డంతో.. అభిమానులు, ప్రేక్ష‌కుల‌కు ఈ షో ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎగ్జైట్‌గా ఎదురు చూస్తున్నారు.

Jr NTR to start shooting for Evaru Meelo Koteeswarulu soon - Times of India

అయితే తాజాగా ఈ షో ప్రారంభ తేదీని మేక‌ర్స్ రివిల్ చేశారు. అగష్టు 22వ తేదీ నుంచి ఈ షో స్టార్ట్ కానుంద‌ని ఓ చిన్న ప్రోమోను విడుద‌ల చేశారు. ఈ ప్రోమోలోన ఎన్టీఆర్‌.. `వస్తున్న మీ ప్రతి ఇంటికి వచ్చేస్తున్నా.. ఎవరు మీలో కోటీశ్వరులు ప్రతి సోమవారం నుంచి బుధవారం సాయంత్రం రాత్రి 8:30 గంటలకు మీ జెమిని టీవీలో` అంటూ త‌న‌దైన స్టైల్‌లో చెప్పుకొచ్చాడు.

Meelo Evaru Koteeswarudu': Jr NTR to make small screen comeback after five  years

ప్ర‌స్తుతం ఈ ప్రోమో నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇక్క‌డ మ‌రో విష‌యం ఏంటంటే.. ఆగ‌ష్టు 22న మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్‌డే. క‌రెక్ట్‌గా అదే తేదీన రావ‌డానికి ఎన్టీఆర్ ఫిక్స్ అవ్వ‌డంతో.. మెగా అభిమానులు కూడా సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

చిరు బ‌ర్త్‌డేకి ఫిక్సైన ఎన్టీఆర్‌..ఫుల్ ఎగ్జైట్‌గా ఫ్యాన్స్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts