మ‌హేష్‌ను ద‌డ‌ద‌డ‌లాడించిన ఎన్టీఆర్‌..`ఈఎమ్‌కె` ప్రోమో అదుర్స్‌!

ఓవైపు వ‌రుస సినిమాల‌తో బిజీగా గ‌డుపుతున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. మ‌ర‌వైపు హోస్ట్‌గా `ఎవరు మీలో కోటీశ్వరులు(ఈఎమ్‌కె)` షోతో బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేస్తున్నారు. సామాన్యుల‌నే కాకుండా అప్పుడ‌ప్పుడూ సెల‌బ్రెటీల‌ను కూడా రంగంలోకి దింపుతూ షోను ఎన్టీఆర్ బాగానే ర‌క్తి క‌ట్టిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ షోలో రామ్ చ‌ర‌ణ్‌, రాజ‌మౌళి, కొర‌టాల శివ‌, స‌మంత వంటి వారు విచ్చేయ‌గా.. ఇప్పుడు ఎన్టీఆర్‌తో సంద‌డి చేసేందుకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం బ‌రిలోకి దిగారు. […]

అర‌రే..రంగ‌మ్మ‌త్త కూడా వాళ్ల‌ని కాపాడ‌లేక‌పోయిందా..?

దేశవ్యాప్తంగా ఎంతో పాపులారిటీ అందుకున్న మాస్టర్ చెఫ్ కార్యక్రమాన్ని తెలుగులో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్ర‌ముఖ టీవీ ఛానెల్ జెమినీలో ఈ షో ప్రసారం అవుతోంది. మొద‌ట ఈ కుక్కింగ్ షోకు మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌గా.. ఆమెకున్న క్రేజ్ ఈ షో టీఆర్పీనీ ఏ మాత్రం పెంచ‌లేక‌పోయింది. దాంతో షో నిర్వాహ‌కులు త‌మ‌న్నాను త‌ప్పించి బుల్లితెర హాట్ యాంక‌ర్ అన‌సూయ‌ను రంగంలోకి దింపారు. కానీ, వినిపిస్తున్న తాజా స‌మాచారం ప్ర‌కారం.. అన‌సూయ సైతం మాస్ట‌ర్ […]

అనసూయ ముందు తేలిపోయిన త‌మ‌న్నా..సూపర్ స్టైలిష్‌గా రంగ‌మ్మ‌త్త‌!

అనసూయ భరధ్వాజ్.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బుల్లితెర‌పై హాట్ యాంక‌ర్‌గా సూప‌ర్ పాపుల‌ర్ అయిన అను.. వెండితెర‌పై త‌న న‌ట‌నా విశ్వ‌రూపాన్ని చూపించి మంచి న‌టిగా కూడా ఫ్రూవ్ చేసుకుంది. ప్ర‌స్తుతం వ‌రుస టీవీ షోలు, సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న మ‌న రంగ‌మ్మ‌త్త‌.. త‌న రేంజ్‌ ఏంటో మరోసారి నిరూపించుకుంది. ఆమె క్రేజ్‌ ముందు టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా కూడా తేలిపోయింది. అస‌లు విష‌యం ఏంటంటే.. త‌మ‌న్నా తొలి సారి […]

జెమినీ టీవీ టీఆర్పీని లేప‌లేక‌పోయిన ఎన్టీఆర్‌.. కార‌ణం అదేన‌ట‌..?!

ఒక‌ప్పుడు భారీ టీఆర్పీతో టాప్ ప్లేస్ లో ఉండే జెమినీ టీవీ.. ప్ర‌స్తుతం త‌న ఉనికిని చాట‌లేక‌పోతోంది. కొత్త సినిమాలు ప్ర‌సార‌మైన‌ప్పుడు మిన‌హా ప్రేక్ష‌కులు జెమినీ టీవీ వైపు చూడ‌ట‌మే మానేశారు. దాంతో అగ్ర‌స్థానంలో ఉండే జెమినీ టీవీ.. స్టార్ మా, జీ తెలుగు, ఈటీవీల తర్వాత నాలుగవ స్థానంలో కొన‌సాగుతోంది. తాజా రేటింగ్స్ లోనూ జెమిని నాలుగవ స్థానానికే ప‌రిమితం అయింది. స్టార్ మా ఛానల్ సుమారు 2300 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగ‌గా.. 1500 పాయింట్లతో […]

జూనియర్ ఎన్టీఆర్‌కు ఘోర అవమానం.. ఏం జరిగిందంటే?

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు పోలికలు పుణికి పుచ్చుకుని వెండితెరపై సత్తా చాటుతున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్. తారక్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో తెలంగాణ యోధుడు కొమురం భీంగా నటించారు. దాంతో పాటు తారక్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పాల్గొని సందడి చేశాడు. కాగా, షో లో నెక్స్ట్ పార్టిసిపెంట్స్‌తో సంభాషణల సందర్భంగా తారక్ తనకు […]

హోస్ట్ గా ఎన్టీఆర్ ఆ షోలో లేనట్లేనా.. ?

బుల్లితెర జెమిని టీవిలో ప్రసారమయిన మీలో ఎవ‌రు కోటీశ్వ‌రులు మొదటి ఎపిసోడ్ సుపర్ సక్సస్ అయింది. తొలి ఎపిసోడ్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అతిధిగా వచ్చి అందరిని ఆశ్చర్య పరిచాడు. ఒక పక్క హాట్ సీట్ చరణ్ మరో పక్క హోస్ట్ గా ఎన్టీఆర్ లను ఒకే వేదికపై చూసి అభిమానులు పండగ చేసుకున్నారు. ఎన్టీఆర్ యాంకరింగ్ కి ను మెచ్చి `బుల్లితెర‌పై షోమేన్‌…` అంటూ చ‌ర‌ణ్ ఎన్టీఆర్ ను అభివర్ణించారు. అయితే […]

తారక్‌కు రాఖీలు కట్టిన బుల్లి చెల్లెళ్లు.. ఫోటోలు వైరల్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూ తన అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తున్నాడు. ఇప్పటికే తారక్ నటించిన ఆర్ఆర్ఆర్ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో మనకు తెలిసిందే. తాజాగా తారక్ తనలోని యాంకర్‌ను మరోసారి మనకు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమం ద్వారా పరిచయం చేసేందుకు రెడీ అయ్యాడు. ఈ గేమ్ షోను హోస్ట్ చేస్తున్న తారక్, కర్టెన్ రైజర్ షోను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి స్టార్ట్ […]

ఇద్దరు ‘రామ్’లలో ఎవరు బాగా సందడి చేశారు?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సినిమాలతో వెండితెరపై ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన బుల్లితెరపై కూడా తన ప్రతాపాన్ని మరోసారి చూపించేందుకు రెడీ అయ్యాడు. గతంలో ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 1’ను హోస్ట్ చేసి అందరితో శభాష్ అనిపించుకున్న తారక్, ఇప్పుడు మరోసారి వ్యాఖ్యాతగా మారుతున్నాడు. జెమినీ టీవీ ఛానల్‌లో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే గేమ్ షోకు తారక్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ షోకు సంబంధించిన కర్టెన్ రైజర్ […]

చ‌ర‌ణ్‌కు దండం పెట్టేస్తున్న‌ ఎన్టీఆర్‌..అదిరిపోయిన `ఇఎంకె` ప్రోమో!

జెమినీ టీవీలో త్వ‌ర‌లోనే స్టార్ట్ కాబోతున్న అతి పెద్ద గేమ్ షో ఎవరు మీలో కోటీశ్వరులు (ఇఎంకె)కు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ షో ఆగ‌ష్టు 22ను ప్ర‌సారం కాబోతోంది. ఇక అనుకున్న‌ట్టుగానే ఫ‌స్ట్ ఎపిసోడ్‌ను స్పెష‌ల్ ఎపిసోడ్‌గా మార్చి.. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ను తీసుకొస్తున్నారు నిర్వాహ‌కులు. అంతేకాదు, తాజాగా ఈ స్పెష‌ల్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను కూడా విడుద‌ల చేశారు. చరణ్, ఎన్టీఆర్ మధ్య సరదా సంభాషణలతో […]