జెమినీ టీవీ టీఆర్పీని లేప‌లేక‌పోయిన ఎన్టీఆర్‌.. కార‌ణం అదేన‌ట‌..?!

ఒక‌ప్పుడు భారీ టీఆర్పీతో టాప్ ప్లేస్ లో ఉండే జెమినీ టీవీ.. ప్ర‌స్తుతం త‌న ఉనికిని చాట‌లేక‌పోతోంది. కొత్త సినిమాలు ప్ర‌సార‌మైన‌ప్పుడు మిన‌హా ప్రేక్ష‌కులు జెమినీ టీవీ వైపు చూడ‌ట‌మే మానేశారు. దాంతో అగ్ర‌స్థానంలో ఉండే జెమినీ టీవీ.. స్టార్ మా, జీ తెలుగు, ఈటీవీల తర్వాత నాలుగవ స్థానంలో కొన‌సాగుతోంది.

NTR to host Gemini TV's 'Evaru Meelo Koteeswarulu' | Indian Television Dot Com

తాజా రేటింగ్స్ లోనూ జెమిని నాలుగవ స్థానానికే ప‌రిమితం అయింది. స్టార్ మా ఛానల్ సుమారు 2300 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగ‌గా.. 1500 పాయింట్లతో జీతెలుగు రెండవ స్థానంలో, 1200 పాయింట్లతో ఈ టీవీ మూడవ స్థానంలో, 1000 పాయింట్లతో జెమినీ టీవీ నాలుగో స్థానంలో కొన‌సాగుతున్నాయి. అయితే నిజానికి జెమిని టీవీ టీఆర్పీని పెంచేందుకు `ఎవరు మీలో కోటీశ్వరులు` షోతో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగాడు. ఆగస్టు 22వ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ చేతుల మీద‌గా ప్రారంభ‌మైన ఈ షో మొద‌ట భారీ టీఆర్పీనే సాధించిన‌ప్ప‌టికీ రాను రాను డ‌ల్ అయిపోయింది.

Star Maa Devatha Latest Serial Gossip and upcoming Story

ఇందుకు కార‌ణం `దేవత` సీరియల్‌నే అని తెలుస్తోంది. జెమినీలో ఎవరు మీలో కోటీశ్వరులు ప్రసారం అయ్యే సమయంలోనే స్టార్ మాలో దేవత సీరియల్ ప్ర‌సారం అవుతోంది. అత్య‌ధిక టీఆర్పీని సాధిస్తున్న సీరియ‌ల్స్ లిస్ట్‌లో దేవ‌త ఒక‌టి. దాంతో ఈ సీరియ‌ల్ ఎఫెక్ట్ ఎన్టీఆర్ షోపై తీవ్రంగా ప‌డుతోంది. అందు వ‌ల్ల‌నే ఎన్టీఆర్ జెమిని టీవీ టీఆర్పీని లేప‌లేక‌పోతున్నార‌ని టాక్ న‌డుస్తోంది. ఇక మ‌రోవైపు జెమినీ కోసం `మాస్టర్ చెఫ్` అనే భారీ ప్రోగ్రామ్‌తో త‌మ‌న్నా సైతం బ‌రిలోకి దిగింది. అయిన‌ప్ప‌టికీ టీఆర్పీ విష‌యంలో జెమినీ నాల్గొవ స్థానంలోనే మిగిలిపోయింది.

Tamannaah Master Chef Telugu Ad | MS entertainments - YouTube

Share post:

Latest