టాలీవుడ్ హీరో ల పై ప్రకాష్ రాజ్ కామెంట్స్..!

September 14, 2021 at 12:16 pm

సినీ ఇండస్ట్రీలో మా .. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతోందని చెప్పాలి.. ఎందుకంటే అక్టోబర్ 10వ తేదీన ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో పోటీదారులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రకాష్ రాజ్ సినీ ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది స్టార్ హీరోల ను మధ్యాహ్నం భోజనానికి పిలిచి, వారందరిని ఎందుకు మా ఎలక్షన్స్ లో పాల్గొనడం లేదు అని ప్రశ్నించాడు.. అంతేకాదు వాళ్ల పర్సనల్ కారణాల వల్ల ఎలక్షన్లకు దూరంగా ఉంటే కచ్చితంగా వాటిని పక్కనపెట్టి, ఎలక్షన్లకు హాజరుకావాలని సూచించాడు.

అంతేకాదు ప్రతి ఒక్కరు ఈ మా ఎలక్షన్స్ లో పాల్గొనాలి అని తమ ఓటును వినియోగించాలని కూడా తెలిపాడు. ఇక అంతే కాదు తాను కనుక ఒకవేళ మా ఎలక్షన్స్ లో మా అధ్యక్షపదవిని గనుక పొందినట్లయితే , పది కోట్ల రూపాయలను స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు కేటాయిస్తానని తెలిపాడు. ఇకపోతే మంచు విష్ణు అధ్యక్ష పదవికి పోటీ చేసి అధ్యక్షుడిగా గెలిస్తే ఏకంగా భవనాన్ని నిర్మిస్తామని చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.Tollywood Heroes in 2015: A Retrospective

లాక్ డౌన్ సమయంలో ఇలా స్టార్ హీరోలను భోజనానికి పిలవడం ఏంటి..? కరోనా నిబంధనలను పాటించడం లేదు అంటూ ప్రకాష్ రాజ్ పై బండ్ల గణేష్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.. అయితే తాను కరోనా నిబంధనలు పాటిస్తూ , కొంతమందిని.. మాత్రమే భోజనానికి ఆహ్వానం పలికినట్లు తెలిపాడు ప్రకాష్ రాజ్.

టాలీవుడ్ హీరో ల పై ప్రకాష్ రాజ్ కామెంట్స్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts