రికార్డుల మోత మోగించిన లవ్ స్టోరీ..?

September 14, 2021 at 12:21 pm

టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగార్జున కొడుకు నటిస్తున్న ప్రస్తుత చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమాను శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో హీరోయిన్ల సాయి పల్లవి నటిస్తోంది. ఈ సినిమా వినాయక చవితి పండుగ సందర్భంగా విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత మరి సెప్టెంబర్ 24 వాయిదా వేసుకున్నారు.

ఇక ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఈ సినిమా ప్రమోషన్ బాగానే చేసుకుంటున్నారు ఈ చిత్ర యూనిట్ సభ్యులు. అందులో భాగంగా నిన్న ట్రైలర్ ని విడుదల చేయడం జరిగింది. ఇక ఈ సినిమా ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ లభిస్తోంది. ఈ ట్రైలర్ విడుదలైన 24 గంటలలోనే కొన్ని రికార్డును క్రియేట్ చేసింది. అవి ఏమిటంటే 4 మిలియన్స్ ప్లస్ వ్యూస్ తో.. పాటు 300 k ప్లస్ లైక్స్ తో రికార్డ్ క్రియేట్ చేసింది ఈ ట్రైలర్.

ఈ ట్రైలర్ చూసిన అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి చిత్ర యూనిట్ సభ్యులు కూడా వరుసపెట్టి ఇంటర్వ్యూ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.అయితే ఈ సినిమా ఎలాంటి మాయ చేస్తుందో తెలియాలంటే..కొద్ది రోజులు ఆగాల్సిందే.https://youtu.be/1yH_eOxpkwo?t=2

రికార్డుల మోత మోగించిన లవ్ స్టోరీ..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts