మ‌హేష్‌ను ద‌డ‌ద‌డ‌లాడించిన ఎన్టీఆర్‌..`ఈఎమ్‌కె` ప్రోమో అదుర్స్‌!

November 23, 2021 at 5:14 pm

ఓవైపు వ‌రుస సినిమాల‌తో బిజీగా గ‌డుపుతున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. మ‌ర‌వైపు హోస్ట్‌గా `ఎవరు మీలో కోటీశ్వరులు(ఈఎమ్‌కె)` షోతో బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేస్తున్నారు. సామాన్యుల‌నే కాకుండా అప్పుడ‌ప్పుడూ సెల‌బ్రెటీల‌ను కూడా రంగంలోకి దింపుతూ షోను ఎన్టీఆర్ బాగానే ర‌క్తి క‌ట్టిస్తున్నాడు.

Jr NTR to start shooting for Evaru Meelo Koteeswarulu soon - Times of India

ఇప్ప‌టికే ఈ షోలో రామ్ చ‌ర‌ణ్‌, రాజ‌మౌళి, కొర‌టాల శివ‌, స‌మంత వంటి వారు విచ్చేయ‌గా.. ఇప్పుడు ఎన్టీఆర్‌తో సంద‌డి చేసేందుకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం బ‌రిలోకి దిగారు. నిజానికి ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన షోటింగ్ ఎప్పుడో పూర్తి అయింది. కానీ, జెమిని టీవీ వారు మాత్రం ఈ గ్రాండ్ ఎపిసోడ్‌ను ప్ర‌సారం చేయ‌కుండా అటు ఎన్టీఆర్‌, ఇటు మ‌హేష్ అభిమానుల‌ను ఊరిస్తూ ఊరిస్తూ వ‌చ్చారు.

Evaru Meelo Koteeswarulu: Mahesh Babu, Jr NTR's Episode Sees the Two Telugu  Stars Greeting Each Other Gracefully (Watch Promo) | 🎥 LatestLY

అయితే ఈ బ్లాక్ బస్టర్ ఎపిసొడ్ త్వ‌ర‌లోనే ప్ర‌సారం కానుండ‌గా.. ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో ను తాజాగా మేక‌ర్స్‌ విడుద‌ల చేశారు. ఇందులో `వెల్ కమ్ మహేష్ అన్నా..`అంటూ ఎన్టీఆర్ చప్పట్లతో సూపర్ స్టార్ ని ఆహ్వానించారు. `అదిరిపోయింది` అని మహేష్ అంటుండగా.. `నా రాజా` అంటూ తారక్ నవ్వేశారు. `కరెక్ట్ ఆన్సర్ ని ఇటు తిప్పి అటు తిప్పి ఎందుకు` అని మహేష్ అంటే.. `సరదా` అని తార‌క్‌ బదులిచ్చారు.

Mahesh Babu is the next chief guest on Jr NTR's Evaru Meelo Koteeswarulu.  See leaked pic - Television News

వీరి సంభాష‌ణ బ‌ట్టీ చూస్తుంటే.. మ‌హేష్‌ను ఎన్టీఆర్ ర‌స‌వ‌త్త‌ర‌మైన ప్ర‌శ్న‌ల‌తో ద‌డ‌ద‌డ‌లాడించిన‌ట్టే క‌నిపిస్తోంది. మొత్తానికి ఆక‌ట్టుకుంటున్న తాజా ప్రోమో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. ముఖ్యంగా మహేష్ – ఎన్టీఆర్ ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో ఇద్ద‌రి హీరోల అభిమానులు తెగ మురిసిపోతున్నారు. అంతేకాదు, ఈ ఎపిసోడ్ భారీ టీఆర్పీ రేటింగ్‌ను కొల్ల‌గొట్ట‌డం ఖాయ‌మ‌ని ముంచే చెప్పేస్తున్నారు.

మ‌హేష్‌ను ద‌డ‌ద‌డ‌లాడించిన ఎన్టీఆర్‌..`ఈఎమ్‌కె` ప్రోమో అదుర్స్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts