‘ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌ ‘ లో చంద్ర‌బాబు రోల్‌కు ఆ హీరో ఫిక్స్‌

విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కిస్తోన్న లేటెస్ట్ సంచ‌ల‌నం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. దివంగ‌త మాజీ సీఎం, టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు అయిన ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర‌లో చివ‌రి అంకాన్ని బేస్ చేసుకుని వ‌ర్మ తెర‌కెక్కిస్తోన్న ఈ సినిమాపై అప్పుడే కాంట్ర‌వ‌ర్సీ చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఈ బయోపిక్ ను లక్ష్మీ పార్వతి కోణంలోంచి తీస్తానని ఆరంభంలోనే బాంబు పేల్చిన వర్మ ముఖ్య పాత్రల కోసం నటీనటుల్ని ఎంచుకునే పనిలో ఉన్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌, లక్ష్మీపార్వ‌తితో పాటు ప్ర‌స్తుత […]

టీడీపీలోకి మాజీ మంత్రి… బాబు మంచి ఆఫ‌ర్‌

సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌, కాంగ్రెస్ మాజీ మంత్రి డీఎల్ ర‌వీంద్రా రెడ్డి  సైకిలెక్క‌డం ఖాయ‌మైపోయింది. క‌డ‌ప జిల్లా మైదుకూరుకు చెందిన డీఎల్ స్థానికంగా బ‌ల‌మైన నేత‌. కాంగ్రెస్‌లో ఉండ‌గా తిరుగులేని నేత‌గా పేరు తెచ్చుకున్నారు. అయితే, విభ‌జ‌న త‌ర్వాత కాంగ్రెస్ రూపు రేఖ‌లు మారిపోయి.. అడ్ర‌స్ గ‌ల్లంత‌వ‌డంతో ఆయ‌న పార్టీ మారాల‌ని డిసైడ్ అయ్యారు. 2019 ఎన్నిక‌లు ముంచుకొస్తున్న త‌రుణంలో పార్టీ మారి ఎమ్మెల్యే సీటు సంపాయించాల‌ని ప్లాన్ వేశారు. ఈ క్ర‌మంలోనే తొలుత ఆయ‌న వైసీపీ […]

పశ్చిమ గోదావరిలో జేసీ ఫార్ములా బెడిసికొట్టిందిగా

జేసీ ఫార్ములా!  ఇప్పుడు టీడీపీలో పెద్ద ఎత్తున ప్ర‌చారంలో ఉన్న ఫార్ములా!  అనంత‌పురం ఎంపీ త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప‌నులు చేయించుకోవడం కోసం తెర‌మీద‌కి తెచ్చిన ఫార్ములా ఇది. త‌న మ‌న‌సు చెబుతోంద‌ని అంటూ ఆయ‌న త‌న సీటుకు రాజీనామా చేసేందుకు రెడీ అయిన ఉదంతం! దీంతో అధిష్టానం దిగివ‌చ్చి ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలోని చాగ‌ల్లుకు నీళ్లు అందించింది. ఇక‌, ఇప్పుడు త‌మ త‌మ ప‌నులు సాధించుకోవ‌డం కోసం పలువురు నేత‌లు ఈ ఫార్ములానే ఫాలో అయిపోవాల‌ని నిశ్చ‌యించుకున్నారు. అయితే, […]

బాబు వ్యూహం ఫ‌లిస్తే.. ఏపీకి తిరుగుండ‌దు!

రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్ర‌బాబు ఎంత‌గా క‌ష్ట‌ప‌డుతున్నార‌నే విష‌యంలో ఏ ఒక్క‌రికీ సందేహం లేదు. నిజానికి ఈ మాట విప‌క్షం వైసీపీలోని స‌గానికిపైగా నేత‌లు అంగీక‌రిస్తున్నదే. రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే పెట్టుబ‌డులు కావాల్సిందే. ముఖ్యంగా విభ‌జ‌న త‌ర్వాత ఏపీ ఆర్థిక ప‌రిస్థితి దారుణంగా ఉంది. లోటు బ‌డ్జెట్ స‌హా ఖ‌ర్చులు, సామాజిక అభివృద్ధి ప‌థ‌కాలు వంటివి ప్ర‌భుత్వానికి గుదిబండ‌గా మారాయి. ఈ నేప‌థ్యంలో పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణ ద్వారానే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోగ‌ల‌మ‌ని భావించారు […]

టీడీపీ కొత్త క‌మిటీల ఎఫెక్ట్‌… పార్టీలో చంద్ర ‘ బాంబు ‘

ఏపీ అధికార పార్టీ టీడీపీలో ఇప్పుడు నిప్పులేకుండానే సెగ‌లు రాజుకుని పొగ‌లు క‌క్కుతున్నాయి. నిన్న పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం చంద్ర‌బాబు పార్టీలో జాతీయ‌, రాష్ట్రీయ క‌మిటీల‌ను నియ‌మించారు. వ‌చ్చే ఏడాది చివ‌రిలో కానీ, ఆ పై ఏడాది మొద‌ట్లో కానీ సార్వ‌త్రిక ఎన్నిక‌లు ఉన్నందున గెలుపే ధ్యేయంగా ఏపీలోనూ క‌నీసం స‌గం సీట్లు సాధించాల‌నే ల‌క్ష్యంతో తెలంగాణ‌లోనూ ఈ క‌మిటీల‌ను ఏర్పాటు చేశారు. అయితే, కొంద‌రు త‌మ‌కు ఈ క‌మిటీల్లో చోటు ద‌క్క‌లేద‌ని భావిస్తూ.. అల‌క […]

సీఎంగా బాబు – విప‌క్ష నేత‌గా జ‌గ‌న్‌: ఎవ‌రు బెస్ట్‌… ఎవ‌రు వేస్ట్‌

ఒకరు సీఎం, మ‌రొక‌రు విప‌క్ష నేత ఇద్ద‌రూ బ‌లంగా ఉన్న నేత‌లే. అయినా కూడా ఏపీకి ఏమీ సాధించ‌లేక‌పోతున్నార‌నే టాక్ వినిపిస్తోంది. సీఎంగా అనుభ‌వ‌మున్న చంద్ర‌బాబు, విప‌క్ష నేత‌గా యువ‌నేత జ‌గ‌న్‌లు ఈ రాష్ట్రానికి ఏదో చేస్తార‌ని ఆశ‌లు పెట్టుకున్న‌వారి ఆశలు ఇప్ప‌డు అడియాశ‌లే అవుతున్నాయి. విష‌యంలోకి వెళ్తే.. 2014 ఎన్నిక‌ల్లో హోరా హోరీ పోరు సాగింది. ఈ క్ర‌మంలో అంద‌రూ జ‌గ‌న్ సీఎం సీటు ఎక్క‌డం ఖాయ‌మ‌నే వార్త‌లు వ‌చ్చాయి. దీంతో చంద్ర‌బాబు నిద్ర‌లేని రాత్రులే […]

ఎన్టీఆర్ స‌త్తా బాబుకు తెలిసిందా

అవును! ఎవ‌రి అవ‌స‌రాలు ఎప్పుడు ఎక్క‌డ ఎలా అవ‌స‌ర‌మ‌వుతాయో చెప్ప‌డం క‌ష్టం. ఇక‌, పాలిటిక్స్ అన్నాక ఈ అవ‌స‌రాలు మ‌రీ ఎక్కువ‌గా ఉంటాయి. సీనియ‌ర్ రాజ‌కీయ పండితుడిగా, సుదీర్ఘ అనుభ‌వం ఉన్న సీఎంగా చంద్ర‌బాబు ఈ విష‌యంలో చాలా అప్ర‌మ‌త్తంగా ఉంటార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. విష‌యంలోకి వెళ్తే.. నంద‌మూరి కుటుంబం నుంచి రాజ‌కీయాల్లో యాక్టివ్‌గా గ‌తంలో ప‌నిచేసిన నంద‌మూరి హ‌రికృష్ణ‌ను బాబు పక్క‌న పెట్టేశార‌నే వార్త‌లు ఇటీవ‌ల కాలంలో జోరందుకున్నాయి. హ‌రితో బాబుకు ప‌నిలేద‌ని అందుకే […]

ఏపీలో ఆ జిల్లా అంతా వార‌సుల రాజ‌కీయాలే…

అపార రాజ‌కీయ అనుభ‌వం ఉన్న సీఎం చంద్ర‌బాబుతో నాయ‌కులు పోటీ ప‌డాలంటే కొంత ఆలోచించ‌క త‌ప్ప‌దు! మ‌రి ఇప్పుడు కొంత‌మంది నాయ‌కులు ఆయ‌న్ను ఆద‌ర్శంగా తీసుకుంటున్నారు. ఏ విష‌యంలో అంటారా? వార‌సుల‌ను రంగంలోకి దించ‌డంలో!! ప్ర‌స్తుతం వార‌స్వ‌త రాజ‌కీయాలు ఏపీలో జోరందుకున్నాయి! ఎన్నిక‌లకు మ‌రో ఏడాదిన్న‌ర స‌మ‌యం ఉండ‌టంతో.. త‌మ వార‌సుల‌ను రంగంలోకి దించేస్తున్నారు నాయ‌కులు! ముఖ్యంగా టీడీపీలో త‌రాలు మారే స‌మ‌యం వ‌చ్చిందేమో అనిపించ‌క మాన‌దు! యువ‌ర‌క్తాన్ని నింపేందుకు సీఎం చంద్ర‌బాబుతో స‌హా ఇత‌ర నేత‌లు […]

మ‌హాటీవీ అమ్మేశారు…. డీల్ ఇదే

ఏ వ్య‌క్తినైనా ఆకాశానికి ఎత్తేయాల‌న్నా.. అదే వ్య‌క్తిని పాతాళానికి తొక్కేయాల‌న్నా.. ప్ర‌సార మాధ్య‌మం ఒక్క‌టి చాలు! ఇప్పుడు దాదాపు తెలుగులో ఉన్న టీవీ చానెళ్లు అన్నీ అదే ప‌నిచేస్తున్నాయి. దీంతో పొలిటిక‌ల్‌గా టీవీల‌కు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. తాము ఎలివేట్ అయ్యేందుకు ఏకైక ప్ర‌సార మాధ్య‌మంగా ఎక్కువ మంది టీవీల‌నే న‌మ్ముకుంటున్నారు. ఉమ్మ‌డి ఏపీలో విచ్చ‌ల‌విడిగా టీవీ ఛాన‌ళ్ల రాక ప్రారంభ‌మైన కొత్త‌లో తెలుగు లోగిళ్ల‌లో కొత్త వెలుగుల‌తో అడుగు పెట్టింది మ‌హా టీవీ. […]