అకిరా..చంద్రబాబు కాళ్లకు నమస్కారం చేయడం వెనక ఇంత పెద్ద స్కెచ్ ఉందా..? ఏం ప్లానింగ్ రా బాబు..!

ఒకరు బాగుపడుతూ ఉంటే మరి కొందరు చూడలేరు . అది అందరికీ తెలిసిందే వాళ్లను బాధ పెట్టడానికి.. హింసించడానికి .. టార్చర్ చేయడానికి ఏదో ఒక కారణంగా ట్రై చేస్తూనే ఉంటారు . కాగా తాజాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులను బాధ పెట్టడానికి కొందరు ఆకతాయలు రెడీ అయిపోయారు . పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందాడు పవన్ కళ్యాణ్ . ఈ విన్నింగ్ మూమెంట్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు .

పవన్ కళ్యాణ్ గెలిచాడు అని తెలియగానే చంద్రబాబు నాయుడు ఆయనను డైరెక్ట్గా కలిసి సత్కరించారు. ఈ క్రమంలోనే అఖీరా – పవన్ కళ్యాణ్ భార్య అన్నా లేజినోవా కూడా చంద్రబాబు నాయుడుకు గౌరవ మర్యాదలతో సత్కరించారు . ఈ క్రమంలోని పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు అకిరాని ఇంట్రడ్యూస్ చేస్తున్న మూమెంట్లో అకిరా చంద్రబాబు కాళ్లకు నమస్కరిస్తాడు . ఇది చాలా గౌరవప్రదంగా జరిగింది. మన తెలుగు సాంప్రదాయంలో ఎవరైనా సరే మనకంటే పెద్దవాళ్ల కాళ్లకు నమస్కరించడం బ్లెస్సింగ్స్ తీసుకోవడం చాలా చాలా మంచిదిగా భావిస్తూ ఉంటారు.

అయితే పవన్ కళ్యాణ్ కూడా అఖీరా విషయంలో అలాగే చేశారు . కొంతమంది మాత్రం అప్పుడే పవన్ కళ్యాణ్ ఫ్యూచర్లో కొడుకు రాజకీయాల భవిష్యత్తుకు ఇప్పటినుంచే పునాదులు వేస్తున్నాడు అని చంద్రబాబుకు బిస్కెట్స్ వేస్తున్నాడు అని ట్రోల్ చేస్తున్నారు . అంతేకాదు అకీరా పొలిటికల్ పరంగా సినిమాలు పరంగా ఆయన వారసుడిగా రంగంలోకి దించడానికి ట్రై చేస్తున్నట్లు పలువురు కావాలని మాట్లాడుతున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా తిప్పి కొడుతున్నారు. ప్రెసెంట్ అకిరా – చంద్రబాబు కాళ్లకు నమస్కరిస్తున్న ఫొటోస్ వైరల్ గా మారాయి..!