భారీ మెజారిటీతో గెలిచిన పవన్.. ఆ ఇద్దరు తెలుగు హీరోల ఫోన్ స్విచ్ ఆఫ్.. !?

పవన్ కళ్యాణ్ .. ఈ పేరు ఇప్పుడు ఎలా వైరల్ అవుతుందో..మారుమ్రోగిపోతుందో మనకు తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ .. ఇప్పుడు రాజకీయాలలో పవర్ తీసుకొచ్చిన వన్ అండ్ ఓన్లీ గేమ్ ఛేంజర్ . ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే కామెంట్స్ తో పవన్ కళ్యాణ్ పేరు టామ్ టామ్ గా మారింది. దానికి కారణం కూడా మనకు తెలిసిందే. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఏకంగా 74 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు .

ఈ విన్నింగ్ మూమెంట్స్ ను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకుంటున్నారో కూడా మనకు తెలిసిందే. కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన పేరు ను ఓ రేంజ్ లో ట్రైన్ చేస్తున్నారు . పలువురు సినీ స్టార్స్ హీరోస్ ..హీరోయిన్స్ ..డైరెక్టర్స్.. ప్రొడ్యూసర్స్ పవన్ కళ్యాణ్ కు స్పెషల్గా విషెస్ అందిస్తున్నారు. అయితే ఇద్దరు తెలుగు హీరోలు మాత్రం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా సైలెంట్ అయిపోయినట్లు ప్రచారం జరుగుతుంది . దానికి కారణం ఆ ఇద్దరు జగన్ మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అని పిలవబడుతూ ఉండటమే.

ఎప్పుడైతే జగన్ అధికారంలోకి వచ్చాడో.. అప్పటినుంచి పలు బిజినెస్ ల పేరిట బాగా మింగిల్ అయ్యి కోట్లకు కోట్లు బాగా సంపాదించుకున్నారు అని .. అయితే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అని తెలిసిన మరోక్షణం ఈ ఇద్దరు హీరోలు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని సైలెంట్ గా ఉండిపోయారు అని ప్రచారం జరుగుతుంది. అంతేకాదు పవన్ కళ్యాణ్ గెలవడం ఈ ఇద్దరు హీరోలకి ఇష్టం లేదు అని కూడా ఫాన్స్ చెప్పుకొస్తున్నారు.

పవన్ కళ్యాణ్ గురించి ఏ విధంగా కూడా వాళ్ళు సపోర్ట్ చేసింది లేదు ట్వీట్స్ చేసింది లేదు. అంత మంది జనాల మధ్య వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ ని బూతులు తిడుతున్న సరే సైలెంట్ గా ఉండిపోయారు తప్పిస్తే పవన్ కళ్యాణ్ ని అలా అనకూడదు అంటూ ఏ రోజు చెప్పిన పాపాన పోలేదు.. అలాంటి వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు సైలెంట్ గా ఉండిపోయారు . ప్రజెంట్ ఇదే న్యూస్ ఏపీ రాజకీయాలలో వైరల్ గా మారింది..!!