దారుణంగా ఓడిపోయిన రోజా నెక్స్ట్ ఏం చేయబోతుంది..? జనాల ఒపీనియన్ ఇదే..!

పాపం .. తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచింది అన్న రేంజిలో రోజా భవిష్యత్తు మారిపోయింది. ఇన్నాళ్లు ఇండస్ట్రీలో రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ లేడీ డైనమిక్ స్టార్ అంటూ పలు రకాల ట్యాగ్స్ క్రియేట్ చేసుకుని బాగా వైరల్ అయిన రోజా ..గత కొన్ని గంటల నుంచి సోషల్ మీడియాలో దారుణాతి దారుణంగా ట్రోలింగ్కి గురవుతుంది . దానికి కారణం కూడా మనకు తెలిసిందే. రోజా ఈ ఎన్నికల్లో ఓడిపోయింది. దారుణాతి దారుణంగా ఓడిపోయింది .

దీంతో ఆమెను అందరు ఆడేసుకుంటున్నారు . అయితే రోజా ఓడిపోయింది . ఇప్పుడు ఆమె నెక్స్ట్ ఏం చేయబోతుంది ..? మళ్లీ రాజకీయాలలో అడుగుపెట్టాలి అంటే అది చాలా చాలా కష్టం.. జబర్దస్త్లోకి అడుగుపెడితే ఆమెను ఆ స్థాయిలో ఎంకరేజ్ చేస్తారు అన్న నమ్మకాలు ఎవ్వరికీ లేవు.. మరి రోజా నెక్స్ట్ స్టెప్ ఏంటి..? సినిమాలోకి వస్తుందా ..? పవన్ కళ్యాణ్ ని అమ్మ నా బూతులు తిట్టిన రోజాకు ఏ డైరెక్టర్ అయినా అవకాశం ఇస్తారా ..? అనే విషయం కూడా ఇప్పుడు సంచలనంగా మారింది .

అయితే జనాలు మాత్రం ఆమెకు రకరకాల సజెషన్స్ ఇస్తున్నారు . కొందరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని డబ్బులు సంపాదించుకో అంటుంటే.. మరికొందరు పిచ్చిపిచ్చిగా వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు …టైం బాగా లేకపోతే ఏదైనా జరగొచ్చు అని చెప్పడానికి ఇదే బెస్ట్ నిదర్శనం అంటున్నారు జనాలు. మరి కొంతమంది జనాలు రోజా ఏం చేయబోతుందో వెయిట్ చేసి చూద్దాం అంటూ కౌంటర్ గా కామెంత్స్ చేస్తున్నారు..!!